Saturday, April 27, 2024

చైన్ స్నాచింగ్ దొంగలకు మూడేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Chain-snatching

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చైన్‌స్నాచింగ్ చేసి సంచలనం సృష్టించిన ముగ్గురు సభ్యులు ముఠాకు ఎల్‌బి నగర్ కోర్టు బుధవారం మూడేళ్ల జైలు, ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తరప్రదేశ్, భూలంద్ శహర్‌కు చెందిన చోకా ఆటోడ్రైవర్, నోయిడా, గౌతమ్ బుద్ధా నగర్‌కు చెందిన వాల్మీకి అలియాస్ రాహుల్ అలియాస్ గుడువా అలియాస్ మోను కొత్తపేటకు చెందిన ప్రణీత్ చౌదరి అలియాస్ మన్యా ముగ్గురు కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. సంచలనం సృష్టించిన చైన్‌స్నాచింగ్ కేసులో నగర పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు గతంలో చాలా దొంగతనాలు చేశారు.

ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. చోకాపై 30 కేసులు, మోను వాల్మీకిపై 20, చింతమళ్ల ప్రణీత్ చౌదరిపై 5 కేసులు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జైలులో కలుసుకున్న ముగ్గురు నిందితులు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇక్కడ చోరీలకు పాల్పడ్డారు. హసీనాపురంలో కొండూరి పద్మావతి నడుచుకుంటూ వెళ్తుండగా చైన్ స్నాచింగ్ చేశారు. ఆమె పుస్తెలతాడు 2.7తులాలను చోరీ చేశారు.

నాగోల్ ఫతుల్‌గడ్డకు చెందిన చిలిఓజు నిర్మల తన సోదరుడి ఇంటికి వెళ్లివస్తుండగా ఇద్దరు చైన్‌స్నాచింగ్ చేశారు. మీర్‌పేటలో బద్దం మణెమ్మ కూరగాయలు కొనుగోలు చేసి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ముగ్గురు దొంగలు చైన్ స్నాచింగ్ చేసి పారిపోయారు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నిందితులకు మూడేళ్ల జైలు, రూ.5,000 చొప్పున జరిమానా విధించారు.

Chain snatching burglars are three years in prison

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News