Monday, May 6, 2024

ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

Chalaki chinnadi lyrical song release on july 11

 

విక్టరీ వెంకటేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నారప్ప’. డి.సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండి ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ చిత్రం నుండి ‘చలాకి చిన్నమ్మీ..’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను ఈనెల 11న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు ఫిల్మ్‌మేకర్స్. అయితే ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News