Friday, April 26, 2024

చలాన్ల మోత

- Advertisement -
- Advertisement -

Challans for vehicles violating traffic regulations

=నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు
=ఎవరినీ వదలని ట్రాఫిక్ పోలీసులు
=క్షుణ్ణంగా ప్రతీ వాహనం తనిఖీ
=అందరూ నిబంధనలు పాటించాల్సిందే : సజ్జనార్

హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై మూడు పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు చలాన్ల మోత మొగిస్తున్నారు. గతంలో నిబంధనలు ఉల్లఘించినా పోలీసులు చూసి చూడనట్లు ఉండేవారు, కానీ రోజు రోజుకు ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు ఉల్లంఘిస్తుండడంతో పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల నగరంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల రామచంద్రాపురం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్‌పై వస్తున్న యువకుడు సిగ్నల్ జంప్ చేసి ముందుకు రావడంతో ఆర్టిసి బుస్సు ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇలాంటి సంఘటనలు తరచూ మూడు పోలీస్ కమిషనరేట్లలో చోటుచేసుంటున్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో స్పాట్ చలాన్లు 2019లో 4,04,115 కేసులు, 2020 2,45,995 కేసులు నమోదు చేశారు. స్పాట్ చలాన్లలో 2019లో రూ. 22, 13, 33,900, 2020లో రూ. 14,60,15,600 జరిమానా విధించారు. 20 19లో ఈ చలాన్ల కేసులు 22,53, 487, 2020లో 45,07,962 నమోదు చేశారు.

ఈ చలాన్ల కేసుల్లో 2019లో రూ.9,28,01,195, 2020లో రూ.163,75,45,165 జరిమానా విధించారు. 2020లో సైబరాబాద్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ ఎత్తున రూ. 178,35,60,765 జరిమానా విధించారు. 2019లో 114,95,35,095 జరిమానా విధించారు. గత ఐదారు ఏళ్ల నుంచి చూస్తే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. గతంలో పోలీసులు తమ కళ్ల ముందు ఉన్న వాహనాలపై జరిమానాలు విధించేవారు. కానీ నాన్ కాంటాక్ట్ విధానం ప్రవేశ పెట్టడంతో సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ లేకున్నా, రాంగ్ రూట్, పిలియన్ రైడర్ హెల్మెట్ పెట్టుకోకున్నా జరిమానాలు విధిస్తున్నారు. భారీ వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువగా లోడ్‌తో వెళ్తున్నా కూడా జరిమానాలు విధిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది సిగ్నల్ జంప్ 19,484 కేసులు, కారు సీట్ బెల్టు పెట్టుకోని కేసులు 15,941, ఎక్స్‌ట్రాప్యాసింజర్స్ కేసులు 5,591, సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 3,412 నమోదు చేశారు. వితవుట్ డ్రైవింగ్ లైసెన్స్ 23,059, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు 23,358, ట్రిపుల్ రైడింగ్ 20,849, నోఎంట్రీ కేసులు 19,793 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు వానదారులపై భారీగా జరిమానాలు విధించారు.

అందరూ నిబంధనలు పాటించాల్సిందే : విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్

వాహనదారులు నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధించడం తప్పదనిన సైబరాబాద్ పోలీస్ కమిషర్ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో రోజు రోజుకు కొత్త వాహనాలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. వీటి వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వీటికి తోడు వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు బలవుతున్నారని అన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వారాంతంలో కాకుండా ఏడు రోజుల నిర్వహిస్తున్నా, మద్యం తాగి వాహనాలు నడిపే వారు తగ్గడంలేదని, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజుకు 120మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News