Saturday, May 4, 2024

పంజాబ్ కొత్త సిఎంగా చరణ్‌జిత్ సింగ్

- Advertisement -
- Advertisement -
రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి
ప్రకటించిన కాంగ్రెస్

 

న్యూఢిల్లీ: పంజాబ్‌లో తదుపరి కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కానున్నారని కాంగ్రెస్ నాయకుడు హరీష్ రావత్ ట్వీట్ చేశాడు. దీంతో ఒక్క రోజంతా కొనసాగిన ఊహాగానాలకు తెరపడింది. పంజాబ్ కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకుడిగా ఆయన ఎన్నుకోబడ్డారని రావత్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పంజాబ్‌కు తొలి దళిత సిఎం కానున్నారు చరణ్‌జిత్ సింగ్ చన్నీ.
మూడుసార్లు ఎంఎల్‌ఏగా ఎన్నికైన చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన రాజకీయ రికార్డు కూడా చాలా నిష్కళంకంగా ఉంది. పంజాబ్ అసెంబ్లీ ఆయన గతంలో ప్రతిపక్షనాయకుడిగా కూడా పనిచేశారు. పదవి నుంచి తప్పుకున్న అమరీందర్ సింగ్ క్యాబినెట్‌లో చన్నీ సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీలో చంకౌర్ సాహిబ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News