Monday, April 29, 2024

అందరినీ ఆశ్చర్యపరిచేందుకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’(సాలా క్రాస్ బ్రీడ్). పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ మూవీ బాక్సింగ్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులకు ఐఫీస్ట్ కానుంది. విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో తన డ్యాన్సులతో అందరినీ ఆశ్చర్యపరిచేందుకు రెడీ అయ్యారు. ముంబయ్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ మాస్ నంబర్‌కు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఈ మేరకు నిర్మాత ఛార్మీ ఓ పోస్ట్ చేశారు. “విజయ్ దేవరకొండ ఇది వరకు ఎప్పుడూ చేయనట్టుగా డ్యాన్స్ చేసి అందరినీ అబ్బురపరుస్తారు. నన్ను నమ్మండి. మాస్ క్రేజీగా ఉండబోతోంది ఈ సాంగ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ పర్‌ఫార్మెన్స్ చూశాక ఈ పోస్ట్ పెట్టకుండా ఉండలేకపోయాను’ అంటూ ట్వీట్ చేశారు ఛార్మీ. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి.

Charmi tweet on Vijay Devarakonda mass dance

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News