Saturday, April 27, 2024

మల్లన్న మహా దొంగ

- Advertisement -
- Advertisement -

Chilaka Praveen Comments on Teenmaar Mallanna

క్యూ న్యూస్ ముసుగులో అక్రమాలు
అక్రమ మార్గంలో రూ.200 కోట్ల సంపాదన
తీన్మార్ మల్లన్న అక్రమాలు బయటపెడతా
క్యూన్యూస్ బ్యూరోచీఫ్ చిలుక ప్రవీణ్

హైదరాబాద్: క్యూన్యూస్ పేరుతో తీన్మార్ మల్లన్న బ్లాక్‌మెయిల్‌లకు పాల్పడుతూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని క్యూన్యూస్ బ్యూరోచీఫ్ చీలుక ప్రవీణ్ ఆరోపించారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. పలు మీడియాలో సంస్థల్లో తాను 12 ఏళ్లుగా పని చేశానని, ప్రముఖ మీడియా ఛానెల్‌కి రాజీనామా చేసి మల్లన్నను నమ్ముకొని క్యూన్యూస్‌లోకి వస్తే మోసం చేశాడని ప్రవీణ్ వివరించాడు. తీన్మార్ మల్లన్న మునూరు కాపునకు చెందిన వాడని ఇతర కులాలను ఏమాత్రం దగ్గరకు రానివ్వడని, బటయ మాత్రం బహుజనుల పేరుతో పాదయాత్రలు చేసి ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నాడన్నారు. క్యూన్యూస్‌లో ఒక్క దళితునికి అవకాశం ఇవ్వలేదని, మల్లన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా క్యూ న్యూస్‌లో వివిధ హోదాలలో ఉన్నారన్నారు.

మల్లన్న తన కుటుంబసభ్యులనే స్టేట్ కమిటీలో కీలక బాధ్యతలలో పెట్టుకున్నాడని తెలిపారు. తీన్మార్ మల్లన్న మున్నూరు కాపులకే అధిక ప్రాధాన్యత ఇస్తాడన్నారు. క్యూ న్యూస్ ముసుగులో మల్లన్న ఎన్నో అక్రమ దందాలు చేశాడని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడన్నారు. అతను చేసే అక్రమాలు, బ్లాక్‌మెయిల్ రాజకీయాలన్నీ తనకు తెలుసునని ఆయన తెలిపారు. అదేవిధంగా సామాజిక సేవ పేరుతో రూ. 50 కోట్లు సంపాదించేందుకు ప్లాన్ వేశాడని, ఇందులో భాగంగా క్యూన్యూస్ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కోట్లు వెనకేసుకుంటున్నాడని ప్రవీణ్ అన్నారు.

కెసిఆర్‌ను ఎంత తిడితే తనకు ఎంతో అంత లాభిస్తుందని పదేపదే చెప్పిన సందర్భాలున్నాయన్నారు. రాష్ట్రంలోని వివిధ పార్టీల నుంచి డబ్బులు దండుకుంటున్నాడన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర మల్లన్న డబ్బులు తెచ్చుకున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్తగా తాను రాజకీయ పార్టీ పెడుతున్నానని, ఎంఎల్‌ఎల టికెట్ ఇస్తానని చాలా మందిని మోసం చేశాడని త్వరలో అవన్ని బయటకు వస్తాయన్నారు. ఈక్రమంలో శుక్రవారం నాడు మల్లన్న క్యాబిన్‌లో రూ. 2 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తాలు ఎక్కడవి అని అడిగినందుకే తనకు మల్లన్నకు మధ్య వివాదం మొదలైందన్నారు.

అక్రమాల చిట్టా బయటపెడతా…

త్వరలోనే తీన్మార్ మల్లన్న చిట్ట బయట పెడతానని ప్రవీణ్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ను సైతం టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేయమని మల్లన్న ఒత్తిడి తెచ్చింది మల్లన్నేనని ప్రవీణ్ అన్నారు. ఇప్పటికే మల్లన్న క్యూన్యూస్, బ్లాక్‌మెయిల్ రాజకీయాలు, అక్రమ దందాలతో రూ. 200 కోట్లు సంపాదించాడని తెలిపాడు. అక్రమాలు వెలుగు తీస్తున్నట్లు నటిస్తూ ఎస్సిలు, బిసిలు, మైనార్టీల ను మభ్యపెట్టి మోసం చేస్తున్నాడని మల్లన్నను ఎవరూ నమ్మోదని తెలిపారు.

సిద్ధాంతాల వెనుక అక్రమాలు…

మల్లన్న సిద్ధాంతాలు నమ్మి వస్తే కులం పేరుతో దూషించారని స్టేట్ ఆర్గనైజేషన్ అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న మల్లన్న టీం తనను బెదిరింపులకు పాల్పడుతుందని, ఇటీవల కాలంలో ఓ మహిళ ను బెదిరించి ఆమె నుంచి మల్లన్న భారీగా డబ్బులు వసూలు చేశాడన్నారు. తీన్మార్ మల్లన్న ఓ దొంగ అని ఆయన చాలా మందిని మోసం చేశాడన్నారు. అనంతరం తీన్మార్ మల్లన్న టీమ్ మెంబర్ మందకిషన్ మాట్లాడుతూ మల్లన్న పాదయాత్రలో చాలా కష్ట పడ్డానని బహుజన సిద్ధాంతం చూసి మల్లన్న దగ్గర కు వచ్చామని ఒక్క రూపాయి ఆశించకుండా పని చేస్తే నాపై నిందలు వేశాడని మల్లన్న పెద్ద గజదొంగ అని మల్లన్న భాగోతం త్వరలో బయట పెడతామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News