Monday, May 6, 2024

వికసిస్తున్న బాల సాహిత్యం

- Advertisement -
- Advertisement -

పాల్కురికి సోమనాథుని బసవపురాణంలోని బాల్యం వర్ణనను బాలసాహిత్యంగా చెప్పవచ్చు. నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, మొదలైన కవులు కూడా తమ రచనల్లో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. సుమతి శతకం, వేమన శతకం తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కనిపిస్తాయి. మహాభారతం, రామాయణం, బసవపురాణం, కేయూర బాహు చరిత్ర. పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది.

బాలసాహిత్యం పురోగతి సాధించినది. గేయ, పద్య, గద్య, రూపాలలో బాల సాహిత్యం కన్పిస్తున్నది. చిన్నయ సూరి నీతిచంద్రికలో కథలుగా వ్రాశాడు. కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి.తెలంగాణ సాహిత్యంలో 12వ శతాబ్ధానికి చెందిన ప్రసిద్ధ కవి పాల్కురికి సోమన తొలిసారిగా జోల పాటలను మన కందించాడు. ‘జోసరచుచు సన్ను తిబాడు’ అంటూ జోలపాటను పేర్కొన్నాడు. రాగుంజు పోగుంజులాట, కుందెన గుడి, చప్పట్లు, గుడిగుడి గుంజం గుంజారాగం, సిట్లపొట్లాట, దాగుడుమూతలను తొలిసారిగా మనకందించాడు. ప్రాచీన బాల సాహిత్యం ఆధికంగా గేయరూపంలో ఉండేదని చెప్పవచ్చు.

పాల్కురికి సోమన అనంతరం అనం తామాత్యుని భోజరాజీయం, కొరవిగోపరాజు సింహాసన ద్వాత్రిశక మొదలైన గ్రంథాల్లో బాలసాహిత్యం సందర్భానుసారంగా ప్రస్తావించబడింది. పోతన భాగవతంలో బాల కృష్ణుని ఆటలను వర్ణిస్తూ రాసిన గేయాలు ప్రముఖమైనవి. మడికిసింగన రాసిన ‘సకలనీతి సమ్మతం’, వెలి గందుల కందనామాత్యుడు రాసిన ‘నీతి తారావళి’, వెలిగందుల నారాయణ రాసిన ‘మహా భాగవత ఏకాదశ ద్వాదశ స్కంధాలు’, వేములవాడ భీమకవి చాటు పద్యాలు, చరికొండ ధర్మన ‘చిత్రభారతం’ శరబాంక కవి ‘శరబాంక లింగశ తకం’, శేషప్ప నరసింహ శతకాలు మొదలైనవి నీతిని ప్రబోధిస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
పిల్లలకు వినోదం, విజ్ఞానం, వికాసం అందించడంలో భాగంగా పద వినోదం, గడి-నుడి, గణితంలో గమ్మత్తులు, తేడాలను గుర్తించడం, లెక్కలతో చిక్కులు విప్పడం, పదవృత్తం, దారి కనుక్కోండి, పదాలు కనుక్కోండి, ఇచ్చిన తెలుగు ఆధారాలతో ఇంగ్లీషు పదం కనుక్కోండి, జంతర్ మంతర్ , డైలీ సుడోకు, చుక్కలు కలపండి, పొడుపు – విడుపు, మీకు తెలుసా?, చిలిపి ప్రశ్న, మెదడుకు మేత, బొమ్మలతో ప్రశ్నలు, సైన్సు సంగతులు మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నం ఎంతమాత్రం సరిపోదు.

తెలంగాణ సాహిత్యంలో 12వ శతాబ్ధానికి చెందిన ప్రసిద్ధ కవి పాల్కురికి సోమన తొలిసారిగా జోల పాటలను మన కందించాడు. ‘జోసరచుచు సన్నుతిబాడు’ అంటూ జోలపాటను పేర్కొన్నాడు. రాగుంజు పోగుంజు లాట, కుందెన గుడి, చప్పట్లు, గుడిగుడి గుంజం గుంజారాగం, సిట్లపొట్లాట, దాగుడుమూతలను తొలిసారిగా మనకందించాడు. ప్రాచీన బాల సాహిత్యం ఆధికంగా గేయరూపంలో ఉండేదని చెప్పవచ్చు. పాల్కురికి సోమన అనంతరం అనం తామాత్యుని భోజరాజీయం, కొరవిగోపరాజు సింహాసన ద్వాత్రిశక మొదలైన గ్రంథాల్లో బాలసాహిత్యం సందర్భానుసారంగా ప్రస్తావించబడింది. పోతన భాగవతంలో బాల కృష్ణుని ఆటలను వర్ణిస్తూ రాసిన గేయాలు ప్రముఖమైనవి. మడికిసింగన రాసిన ‘సకలనీతి సమ్మతం’, వెలి గందుల కందనామాత్యుడు రాసిన ‘నీతి తారావళి’, వెలిగందుల నారాయణ రాసిన ‘మహా భాగవత ఏకాదశ ద్వాదశ స్కంధాలు’, వేములవాడ భీమకవి చాటు పద్యాలు, చరికొండ ధర్మన ‘చిత్రభారతం’ శరబాంక కవి ‘శరబాంక లింగశ తకం’, శేషప్ప నరసింహ శతకాలు మొదలైనవి నీతిని ప్రబోధిస్తాయి.

తెలంగాణలో ప్రసిద్ధులైన కవిపండితులు డా.సి.నారాయణ రెడ్డి, దాశరథి, పి.యశోదారెడ్డి, డా.కపిలవాయి లింగమూర్తి, గడియారం రామకృష్ణ శర్మ మొదలైనవారు బాలలకోసం అనేక పద్యాలను, గేయాలను, నీతికథలను, నాటికలను, నవలలను, జీవిత చరిత్రలను రచించారు. ఆచార్య బిరుదురాజు రామరాజు ‘తెలంగాణ’ పిల్లల పాటలు, త్రివేణి పిల్లల పాటల పేర్లతో పుస్తకాలను వెలువరించారు. గడియారం రామకృష్ణశర్మ ‘వీరగాథలు’ అనే బాలవీరుల కథలను మనింకోడు రామయ్య ‘తాతయ్య కథలు’, ‘ఆశాలువ’ నవల, దీక్ష, ఆహుతి, పాకాల యశోదారెడ్డి నక్కబావ, బడిపెద్ద, బుచ్చిగాడు వంటి చాలా కథలను రచించింది. ఆచార్య ఎస్వీ రామారావు ‘శ్రీ సత్యసాయి అవతా రందశావతార గాథలు’లను రచించాడు.

గాదిరాజు సత్యనారాయణరాజు ‘బాల విజ్ఞానలహరి’ను రచించాడు. డి.ఎస్.బాబుదేవిదాస్‌రావు ‘నెహ్రూజీ వ్యక్తిత్వం మీద జీవిత చరిత్రను వెలువరించాడు. డాక్టర్ ఎం.రాములు చిన్నారుల కథలు, సిసింద్రుల కథలు, రామ భాషితంను రచించారు. గుర్రాల లక్ష్మారెడ్డి ‘వెన్నెల జల్లులు’ అనే గేయ సంపుటిని వెలువరించాడు. లక్కరాజు నిర్మల ‘అక్షరమాల’ అనే పిల్లల గేయ సంపుటిని, ఆచార్య జన్ను రాఘవులు ‘బాలగేయాలు’ను, జి.సురేందర్ ‘బాలకథాలహరి’ కె.పుష్పలత ‘పసిడి హృదయాలు’ అనే గేయ సంపుటాలను వెలువరించారు. కోట్ల వెంకటేశ్వర రెడ్డి ‘గుణనిధి చేసిన తప్పు’ బాల కథలను వెలువరించాడు. బి.పద్మాలయాచార్య ‘ఎన్నాళ్ళీ కష్టాలు’ నృత్య రూపకాన్ని రచించింది.

డాక్టర్ మలయశ్రీ ‘బంగారు బొమ్మ లు, తేనె చినుకులు, చుక్కల కోసం, పల్లెసీమ’ అనే బాలల గేయా లను, రేగులపాటి కిషన్‌రావు ‘ప్రగతి పాటలు కొత్తపాటలు’, ‘మల్లె మొగ్గలు’ రేగులపాటి విజయలక్ష్మి ‘పరిష్కారం’, ‘అంతరించిన ఆచారాలు’, గర్షికుర్తి రాజేంద్ర ‘బాల సాహిత్య గేయమాల’, డా. వడ్డేపల్లి కృష్ణ ‘చిరుగజ్జెలు’ ను, టి.వేదాంతసూరి బాలల కోసం 16 పుస్తకాలను రచించారు. డా.జె.బాపురెడ్డి ‘ఆటలు పాటలు, ప్రగతి పాటతోట, బాలహేల’ గ్రంథాలను వెలువరించారు. వాసాల నర్స య్య ‘వాసాల బాలగేయ సుమాలు, తపాల ప్రపంచం’ మొ. పుస్తకాలను రచించారు. గరిపెల్లి అశోక్ గారు ఎంకటి కథలు, బడిపిల్లల కథలు, ఆవు పులి కథ, పుస్తకాలు వెలువరించారు. డా. నలిమెల భాస్కర్ ‘ఈతరం పాటలు’ పుస్తకాన్ని వెలువరించారు.

ప్రసిద్ధ బాల రచయిత రెడ్డి రాఘవయ్య 50కి పైగా బాల సాహిత్య రచనలు చేశారు. గేయాలు, గేయ కథలు, నవలలు, విజ్ఞాన విషయాలు జీవిత చరిత్రలను రచించారు. ‘బాల సాహిత్య నిర్మాతలు’ ‘నేతాజి సుభాష్ చంద్రబోస్ కథ’లను రచించారు. ఐతా చంద్రయ్య ‘పొట్టి శ్రీరాములు, రాణి రుద్రమదేవి, కందుకూరి వీరేశలింగం’, టంగుటూరి ప్రకాశం, చందమామ పదాలు’ మొదలైన బాల సాహిత్య రచనలు చేశారు. డా. బి.దామోదరరావు ‘కథలు కథలుగా’య ‘ఈ సామెత మీకు తెలుసా?’ అనే పుస్తకాలను రచించాడు. ఇంకా వావిలాల భూపతి రెడ్డి, డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, అమ్మిన శ్రీనివాసరాజు, మేకల మధుమోహన రావు, అమ్మన చంద్రారెడ్డి, బోయ జంగయ్య, కందేపేిరాణి ప్రసాద్, ఎన్నవెళ్లి రాజమౌళి,

వారాల ఆనంద్, గుముడాల చక్రవర్తి గౌడ్, డా.సి.వి.జయ వీరరాజు, పుప్పాల కృష్ణమూర్తి, పానుగంటి మల్లేశం, దూడం నాంపల్లి, వీధుల రాంబాబు, వాసరవేణి పరశురాం, మేరెడ్డి యాదగిరిరెడ్డి, రాకుమార, డా. ఎర్రోజు ఆదినారాయణ, పైడిమర్రి రామకృష్ణ, భూపాల్, గరిశకుర్తి శ్యామల, గంధం నరసయ్య, వాసాల వేంకటేశ్వర్లు, మాడిశెట్టి గోపాల్, సూరారం శంకర్, నాగుల చిన్నయ్య, తోకల రాజేశం, పుల్లూరు జగదీశ్వర రావు, నామని సుజాత దేవి, బొబ్బిలి జోసెఫ్ , ఉండ్రాళ్ల రాజేశం, యాడవరం చంద్ర కాంత్, వర్కొలు లక్ష్మయ్య ,బైతిదుర్గయ్య, కాంతి కృష్ణ, వేల్పుల రాజు, సామలేటి లింగమూర్తి, పెందోట వెంకటేశ్వర్లు, కోణం పరశురాములు బసవరాజ్ కుమార్, గంగా శ్రీనివాస్, ఆదిమూలం చిరంజీవి మొదలగు వారు బాల సాహితీ సృజన చేస్తున్నారు.
నేటి బాలల వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే సాహిత్యం రావాల్సి ఉంది. కథలు, గేయాలు, కవితలు, వ్యాసాలు, కార్టూన్లు ఇలా ఏ రూపంలో వచ్చినా సరే బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల శ్రేయస్సు కోరి ఎన్ని మంచి పుస్తకాలు వచ్చినా – మానవత్వం, పరోపకారం, పెద్దలను గౌరవించడం వంటి విషయాలు చెబుతూనే మిగతావాటిపైనా వారి అవగాహనకు తగిన రీతిలో చెప్పాలి. అప్పుడే సమాజానికి మంచి బాల సాహిత్యం ఇచ్చినట్లవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News