Tuesday, April 30, 2024

లాసాపై చైనా చాపర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టిబెట్ రాజధాని లాసాపై చైనా ఏరియల్ డ్రిల్ నిర్వహించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలమేరకే చాపర్లతో మిలిటరీ డ్రిల్ జరిగినట్టు భావిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా టిబెట్‌లోని బుద్ధిస్టులు ఎలాంటి ఆందోళనలకు దిగకుండా ముందస్తు హెచ్చరికగా ఈ చర్యను భావిస్తున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా టిబెట్ యువకులు చైనా పట్ల తమ నిరసన గళాన్ని అంతర్జాతీయ దృష్టికి తెచ్చారు. ఇటీవల అమెరికా చట్టసభలు టిబెట్ బుద్ధిస్టులకు అనుకూలంగా టిబెటన్ విధాన చట్టం2020 పేరుతో రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఆ చట్టం ప్రకారం దలైలామా తర్వాత టిబెట్‌లోని బౌద్ధుల తదుపరి ఆధ్యాత్మిక గురువును వారే ఎన్నుకోవాలి. అందులో ఏ దేశం ప్రమేయం ఉండకూడదు. దీనిపై చైనా ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా చట్టాన్ని హిమాచల్‌ప్రదేశ్ ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వం చారిత్రకమైనదిగా అభివర్ణించింది. అయితే, ఆ చట్టానికి అనుకూలంగా టిబెట్‌లో ఎలాంటి సంఘటనలు జరగడమూ చైనాకు ఇష్టంలేదు. అసమ్మతి కార్యకలాపాలు చేపట్టేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించేందుకే చైనా ఏరియల్ డ్రిల్ నిర్వహించిందని చైనా వ్యవహారాల నిపుణుడు వ్యాఖ్యానించారు.

China flies choppers over Lhasa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News