Saturday, April 27, 2024

మన పోర్టులో చైనా సైబర్ దొంగలు

- Advertisement -
- Advertisement -
Chinese cyber thieves in Indian port
సాంకేతిక నిర్ధారణతో తెలిపిన ఫ్యూచర్

న్యూయార్క్ : భారతదేశానికి చెందిన ఓ రేవు నెట్ వర్క్ వ్యవస్థతో చైనా ఆధ్వర్యపు అధికారిక హ్యాకర్లు ఇప్పటికే కనీసం ఒక్క కీలకమైన కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. సైబర్ దాడిలో భాగంగా ఈ రేవుకు సంబంధించి కీలక రహస్యాలను ఛేదించేందుకు అవసరమైన సాంకేతిక వినిమయ ప్రక్రియను (ట్రాఫిక్)ను నెలకొల్పినట్లు అమెరికాకు చెందిన సైబర్ భద్రతా సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ తెలిపింది. సంస్థకు చెందిన ప్రధాన కార్యనిర్వాహక అధికారి స్టూర్ట్ సోలోమన్ ఈ విషయాన్ని భారత అధికార వర్గాలకు తెలిపారు. పొరుగుదేశం చైనా ఇండియా తో సరిహద్దుల కయ్యాలు వీడి, సైబర్ దాడులతో ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతు న్న విషయం మరింత స్పష్టం అయింది. చైనా భద్రతా వ్యవహారాల శాఖ ప్రోత్సా హంతో చైనాకు చెందిన కంపెనీలు భారతీయ పోర్టుల వెబ్‌సైట్లలోకి చొరబడి, లోగుట్టు రాబట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు స్పష్టం అయింది. గత ఏడాది మధ్య నుంచే ఈ చొరబాట్లు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయని అమెరికా సైబర్ భద్రతా విషయాల సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ తెలిపింది.

భారతీయ పవర్ గ్రిడ్‌ల విచ్ఛిన్నం ద్వారా దేశంలోని కీలక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా విఘాతానికి చైనా కంపెనీలు యత్నించిన విషయం తెలిసిందే. అయితే భారతీయ కీలక వ్యవస్థలపై ఎటువంటి సైబర్ దాడి జరగలేదని దేశ అధికార వర్గాలు స్పష్టం చేశా యి. అయితే అత్యంత ప్రధానమైన ఐటి వ్యవస్థలను దెబ్బతినే విధంగా ఉన్న సాఫ్ట్‌వేర్ వైరస్ మాల్‌వేర్‌ను గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు అంగీకరించాయి. అయితే చైనా కంపెనీలు ఇప్పటికీ భారత్‌లోని పోర్టుల విచ్ఛిన్నానికి పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేసుకుంటున్నాయని అమెరికా సైబర్ నిఘా సంస్థ తెలిపింది.

భారత్ తీర ప్రాంత రేవులు టార్గెట్

భారత్‌లో విద్యుత్ కేంద్రాలతో పాటు ప్రధాన రేవు పట్టణాల విఘాతానికి రెడ్‌ఎకో సంస్థ సైబర్ దాడికి దిగిందని అమెరికా సంస్థ స్పష్టం చేసింది. రేవులకు సంబంధించి చైనా సంబంధిత సంస్థ నుంచి భారతీయ సముద్ర జలాల ఆధీనం లో రేవులకు మధ్య సంకేతాలు అందుతున్నాయని ఫ్యూచర్ సంస్థ తెలిపింది. దాడికి గురైన, దాడికి పాల్పడ్డ కేంద్రాల మధ్య చురుకైన కనెక్షన్ ఏర్పడిందని, దీనితో రెండు భారతీయ రేవుల కీలక సమాచారం చైనా కైవసం అయ్యే వీలుందని హెచ్చరికలు వెలువరించారు. ఇప్పటికీ చైనా సంబంధిత సంస్థ యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించి భారతదేశపు ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఎటువంటి స్పందన వెలువరించలేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా నిర్థిష్ట పక్షంపై బురద చల్లడం బాధ్యతారాహిత్యం అవుతుందని, ఇది దురుద్ధేశపూరిత చర్యగా భావించాల్సి ఉంటుందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ చైనా వాదనను విన్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News