Friday, May 3, 2024

గీత దాటిన చైనా సైనికుడి అప్పగింత

- Advertisement -
- Advertisement -

Chinese soldier will be handed over to that country

 

న్యూఢిల్లీ : భారత్ నిర్బంధంలో ఉన్న చైనా సైనికుడిని ఆ దేశానికి అప్పగించనున్నారు. ఇటీవలే సరిహద్దులలో ఎల్‌ఎసి దాటి వచ్చి చైనాకు చెందిన కార్పొరెల్ వాంగ్ యో లాంగ్ భారత భూభాగంలో సంచరిస్తుండగా భారతీయ సైన్యం పట్టుకుంది. విచారణ క్రమం, పద్ధతులను పాటించిన తరువాత ఉభయదేశాల సైనిక భేటీ ప్రాంతం ఛూషుల్ మోల్డో వద్ద సైనికుడిని చైనా సైనికాధికారులకు అప్పగిస్తారు. ఈ చైనా సైనికుడికి ఇప్పటికే తగు విధమైన వైద్య సాయం అందించారు. ఆహారం, ఎతైన శిఖర ప్రాంతాలలో తట్టుకుని నిలిచేందుకు అనువైన దుస్తులు సమకూర్చారు. ఆక్సిజన్ కూడా అందించారు. భారత్-‌చైనా సరిహద్దుల ఉద్రిక్తతపై 8వ దఫా చర్చల దశలో ఈ సైనికుడి పట్టుబడ్డ విషయాన్ని తెలిపిన ఇండియా, ఆయనను తాము తిరిగి అప్పగిస్తున్న విషయాన్ని కూడా వారికి వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News