Saturday, May 4, 2024

స్పేస్‌వాక్‌లో చైనా మహిళా వ్యోమగామి..

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాకు చెందిన మిలిటరీ పైలట్, మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్ స్పేస్‌వాక్‌లో పాల్గొన్న తొలి చైనా మహిళగా చరిత్ర సృష్టించింది. తియాన్‌గాంగ్ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం వాంగ్‌తోపాటు మరో వ్యోమగామి జాయి జిగాంగ్ ఉన్నారు. సోమవారం ఉదయం వీరిద్దరూ సుమారు 6.5 గంటల పాటు స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. చైనా అక్టోబర్ 16న షింజు13 వ్యోమనౌకలో ముగ్గురు వ్యోమగాములను పంపింది. నిర్మాణంలో ఉన్న అంతరిక్ష స్థావరంలో వీరు ఆరు మాసాలు ఉంటారు. ఈ స్థావరం వచ్చే సంవత్సరం సిద్ధమౌతుంది. అక్కడకు వెళ్లిన ముగ్గురిలో వ్యోమగామి యి గువాంగ్ ఫూ మాత్రం స్పేస్ స్టేషన్‌లో ఉండిపోయారు. స్పేస్‌వాక్ సమయంలో వాంగ్.. స్టేషన్‌కు చెందిన రోబోటిక్ ఆర్మ్‌కు ఓ సాధనాన్ని అమర్చారు. పరికరాల పనితీరును ఇద్దరు వ్యోమగాములు పరీక్షించారు. స్పేస్‌స్టేషన్ నుంచి అడుగు బయటపెట్టిన వెంటనే వ్యోమగామి వాంగ్ చైనీయులకు గ్రీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాంగ్ కన్నా ముందు 1984 నాటి నుంచి 2019 అక్టోబర్ వరకు 15 మంది మహిళలు 42 స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు.

Chinese Woman Astronaut to complete Spacewalk

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News