Monday, May 6, 2024

మహిళతో సిఐ నగ్న వీడియోలు వైరల్

- Advertisement -
- Advertisement -

CI naked with women

చెన్నై: ఓ మహిళతో సిఐ వివాహేతరం సంబంధం పెట్టుకున్న వీడియోలు బయటకు రావడంతో అతడిపై ఉన్నతాధికారులు శాఖ పరమైన చర్యలు తీసుకున్న సంఘటన తమిళనాడులోని తిరుక్కళుకుండ్రమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అతడిని విధుల నుంచి తప్పించడంతో పాటు వెయిటింగ్‌లిస్టులో ఉంచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తిరుక్కళుకుండ్రమ్ పోలీస్ స్టేషన్‌లో మునిశేఖర్ అనే సిఐ విధులు నిర్వహిస్తున్నారు. ఓ మహిళతో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. సదరు మహిళతో సిఐ నగ్నంగా ఉన్న వీడియోలతో ఆమె భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి రావడంతో మునిశేఖర్ ను విధుల నుంచి తొలగించారు. గతంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్‌ను నిలదీస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని మహిళ భర్త పోలీసుల ఎదుట వాపోయాడు. మహిళతో నగ్నంగా మాట్లాడిన వీడియోలు వాట్సాప్‌లో వైరల్‌గా మారాయి. దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News