Monday, May 6, 2024

శతాబ్ది జరుపుకుంటున్న ‘సిటీ కాలేజ్’

- Advertisement -
- Advertisement -

Hyderabad City college

హైదరాబాద్: నగరంలోని సిటీ కాలేజ్ శతాబ్ది జరుపుకుంటోంది. దీనిని ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ 1865లో ఏర్పాటు చేశారు. సిటీ కాలేజ్ భవనాన్ని బ్రిటిష్ వాస్తుశిల్పి విన్సెంట్ జెరోమ్ ఏషే 1921లో నిర్మించారు. నేటికి సిటీ కాలేజ్ చెక్కు చెదరకుండా బలంగా ఉంది. ఈ కాలేజ్ భవనం వంద ఏళ్లు పూర్తి చేసుకుంటున్నా ఇంత వరకు దానికి పెద్దగా మరమ్మతులు అవసరం కాలేదు.

సిటీ కాలేజ్‌ను మొదట్లో ‘మదర్సా దారుల్ ఉలూమ్’గా (ముస్లింల ధార్మిక పాఠశాలగా) ఏర్పాటు చేశారు. అదే నగరంలోని తొలి పాఠశాల. 1929లో సిటీ హైస్కూల్‌గా ఉన్న దానిని సిటీ కాలేజ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. వాన నీరు నివారించేందుకుగాను ఐదారేళ్ల క్రితం రూ. 30-40 లక్షల వరకు ఖర్చు చేశారని సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ పి బాల భాస్కర్ తెలిపారు. ప్రస్తుతం సిటీ కాలేజ్ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధం అవుతోందన్నారు. ఏడవ నిజాం మనుమడు నజఫ్ అలీ ఖాన్ కాలేజ్ యూనివర్సిటీగా అయ్యేందుకు అన్ని హంగులు కలిగివుందన్నారు. నాటి ఈ కాలేజ్ భవనాన్ని వారసత్వంగా పరిరక్షించాల్సి ఉందన్నారు.
సిటీ కాలేజ్‌లో చదువుకున్న పూర్వ విద్యార్థుల్లో హైదరాబాద్ వాస్తుశిల్పి, భారత దేశం తొలి టౌన్ ప్లానర్ ఎం. ఫయజుద్దీన్, మాజీ ముఖ్యమంత్రి మఱ్ఱి చెన్నారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు పి.శివశంకర్, శివరాజ్ పాటిల్, ఒలింపియన్, అర్జున్ అవార్డు గ్రహీత అయిన ఫుట్‌బాలర్ యూసుఫ్ ఖాన్, క్రికెటర్ అర్షద్ ఆయూబ్, అంతర్జాతీయ సైక్లిస్టు సయ్యద్ సలీమ్ అలీ తదితరులు ఉన్నారు.
సిటీ కాలేజ్ 1921లో 30 మంది విద్యార్థుల బ్యాచ్‌తో మొదలయింది. ఒకవేళ సిటీ కాలేజ్‌లో కొత్త భవనాన్ని నిర్మిస్తే అది పూర్వపు వాస్తురీతికి తగినట్లుగానే అందంగా ఉండాలని కళ, సాంస్కృతిక వారసత్వపు భారత జాతీయ ట్రస్ట్ హైదరాబాద్ ఛాప్టర్(ఐఎన్‌టిఎసిహెచ్)కు చెందిన కన్వీనర్ అనూరాధ రెడ్డి అభిప్రాయపడ్డారు. వంద ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సిటీ కాలేజ్ నిజానికి తెలంగాణకే ఒక వారసత్వం, గాథకు ఓ మూలం వంటిదని చెప్పవచ్చు. ఇది హైదరాబాద్ హైకోర్టు భవనానికి అతి సమీపంలో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News