Friday, April 26, 2024

ఎపిలో ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించిన సిఎం జగన్

- Advertisement -
- Advertisement -


అమరావతిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో ఔట్‌సోర్సింగ్ ఉద్యో గుల సమస్యలు తెలుసుకున్నా. గతంలో ఉద్యోగం రావడానికి లంచాలు, జీతం ఇవ్వడానికి లంచాలు. ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను మార్చాలి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో 50శాతం ఎస్సి, ఎస్టి, బీసిలు ఉన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో 50శాతం మహిళలకు కేటాయింపు. 47వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. ఆప్కోస్ ద్వారా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు. ఎలాంటి అవినీతి, లంచాలు లేకుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను తీసుకువచ్చారు. గతంలో భాస్కర్‌నాయుడు అనే వ్యక్తికి అన్ని చోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ భాస్కర్ నాయుడు ఎవరంటే.. చంద్రబాబు మనిషి’ అని తెలిపారు.

CM Jagan video conference on outSourcing corporation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News