Monday, April 29, 2024

తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

సంగెం: ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడుతున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలం చింతలపల్లి, పల్లారుగూడ, మొండ్రాయి, ముమ్మడివరం గ్రామాల్లో స్త్రీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్‌లతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళలకు తోబుట్టు లాగా అండగా నిలుస్తున్న నాయకుడు సిఎం కెసిఆర్ అన్నారు.

పరకాల నియోజకవర్గంలో గిరిజన భవనాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని, దానికి కావల్సిన నిధులు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలోని తండాలను రూ. 20 కోట్ల నిధులు చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 2000 పింఛన్ ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌ది అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నేతల రాష్ట్రంలో పింఛన్ రూ. 700 ఇస్తున్నారన్నారు. రైతును రాజుగా చూడాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, దేశంలో రైతుల కోసం ఆలోచించే సిఎం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అంగన్‌వాడీలకు గౌరవం ఇచ్చిన నాయకుడు సిఎం కెసిఆర్ అన్నారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఏమి అడిగినా సిఎం కెసిఆర్ చేస్తున్నారన్నారు. పరకాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే ధర్మారెడ్డి దొరకడం ఒక వరమని, మనసు పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ధర్మారెడ్డి అని ఆయనను కాపాడుకోవాలన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ పరకాల నియోజకవర్గం మీద అమితమైన ప్రేమ ఉందన్నారు. అభివృద్ధి పనులు ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచామన్నారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామన్నారు. సత్యవతి రాథోడ్ నియోజకవర్గానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు.

మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ.. చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రతీ గ్రామానికి రోడ్లు ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని ప్రతీ గ్రామానికి నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ కళావతి, సర్పంచులు రవికుమార్, కక్కెర్ల కుమారస్వామి, గూడ కుమారస్వామి, ఇజ్జగిరి స్వప్న అశోక్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సారంగపాణి, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ నరహరి, మాజీ ఎంపీపీ సదానందం, మాజీ జడ్పీటీసీ వీరమ్మ, ఎంపీటీసీలు పావని, రాణి మొగిలితోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News