Tuesday, May 28, 2024

మైనార్టీ సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు : ముస్లిం మైనార్టీ సంక్షేమానికి సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యేగూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆధివారం స్థానిక సయ్యద్ హజ్రత్ మురాథ్ అలీషా దర్గాలో ప్రత్యేక పార్థనలు నిర్వహించి,చద్దర్ సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలు కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిందన్నారు.

పటాన్‌చెరు పర్యటనలో భాగంగా డివిజన్ అభివృద్ధ్దికి ప్రత్యేకంగా రు. 10 కోట్ల నిధులు మంజూరు చేశాడన్నారు. ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గణత కేవలం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. పేద ముస్ల్లిం కుటుంబాల వివాహాలకు షాది ముబారక్ పేరుతో ఆర్థిక సహాయం అందిస్తున్న నాయకుడు మన కెసిఆర్ అన్నారు.దర్గాను సంధర్శించిన సందర్భంగా ముస్లిం పెద్దలు అల్లా ఆశిస్సులతో భారి మెజార్టీతో మరో సారి గెలుపు ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మణ్ విజయ్ కుమార్,పట్టణ అధ్యక్షులు అఫ్జల్,నాయకులు లియాకత్ అలి,అజ్మత్, ఖాన్,వాజీద్ అలి,అతిక్, మొయిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News