Tuesday, May 7, 2024

ప్రధాని మోడీకి సిఎం ఫోన్

- Advertisement -
- Advertisement -

CM KCR phone to PM Modi over Corona Treatment

కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కేంద్రం కేటాయించిన ఆక్సిజన్ అందడం లేదు
సరఫరా 500 టన్నులకు పెంచండి
వ్యాక్సిన్, రెమ్‌డెసివిర్‌ల కొరత తీర్చండి
పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు భారీగా కరోనా రోగుల తాకిడి, హైదరాబాద్‌పై భారం పెరిగింది
సానుకూలంగా స్పందించిన ప్రధాని
మోడీ ఆదేశాలతో సిఎం కెసిఆర్‌కు కేంద్రమంత్రి పీయూష్ ఫోన్, కోరినవన్నీ సత్వరమే సమకూరుస్తామని హామీ

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు, ఆక్సీజన్, రెమిడిసివర్ సరఫరా గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్రమోడితో టెలిఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడం లేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మారినందును సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైదరాబాద్‌కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైదరాబాద్ మీద భారం పెరిగిపోయిందని సిఎం వివరించారు. తెలంగాణ జనాభాకు అధనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైదరాబాద్ మీద ఆక్సీజన్, వాక్సీన్ రెమిడిసివర్ మంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సిఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4,900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25,000కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వాక్సీన్లు ప్రతి రోజు 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు. కాగా, సిఎం కెసిఆర్ విజ్జప్తి మేరకు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కెసిఆర్‌తో మాట్లాడారు. ప్రధాని కెసిఆర్ విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమాకూరుస్తామని, ఆక్సీజన్, వాక్సీన్, రెమిడిసివర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సిఎంకు హామీ ఇచ్చారు. ఆక్సీజన్‌ను కర్ణాటక తమిళనాడులనుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామని అన్నారు.

CM KCR phone to PM Modi over Corona Treatment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News