Monday, May 6, 2024

బెల్లంపల్లిలో కరోనా పంజా

- Advertisement -
- Advertisement -

11 Corona Patients died in Bellampalli

బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో ఒకే రోజు 11 మంది కరోనా రోగులు మృతి
 ఆక్సిజన్ అందక గాలిలో కలసిన ప్రాణాలు
 మరో ముగ్గురి పరిస్థితి విషమం, గాంధీ ఆసుపత్రి తరలింపు
 జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన్

మనతెలంగాణ/మంచిర్యాలప్రతినిధి: కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో కేవలం 24 గంటల వ్యవధిలో 11 మంది కరోనాతో మృతి చెందినట్లు అధికారులు దృవీకరించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బెల్లంపల్లి సింగరేణి ఐసోలేషన్ కేంద్రంలో ఆక్సిజన్ అందకనే కరోనా రోగులు మృతి చెందారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఐసోలేషన్ కేంద్రంలో సరైన వైద్య సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఆక్సిజన్ సిలిండర్‌లు ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది ఆక్సిజన్ పెట్టకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో 60 పడకలతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది వాటిని ఉపయోగించడం లేదని ఆరోపిస్తున్నారు. గత వారం రోజు ల్లో ఐసోలేషన్ కేంద్రంలో 18 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. కరోనా మొదటి దశలో రోగులకు అందిన సేవలు ప్రస్తుతం అందడం లేదని వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా అంతట వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ దినదినానికి కరోనా కేసుల సంఖ్య పెరగడంతో భయాందోళనకు గురవుతున్నారు. బెల్లంపల్లి ఐసోలేషన్ కేం ద్రంలో డిజిపి ఆదేశాల మేరకు కొవిడ్19 పోలీస్ సహయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాకు పొంచి ఉన్న ‘మహా’ ముప్పు
జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్ర రోగులతో ప్రమాదం పొంచి ఉంది. సరిహద్దులోని రాజూ రా, బల్షా, చంద్రపూర్‌ల నుంచి కరోనా రోగులను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండగా అక్కడి రోగులను మంచిర్యాలజిల్లా కేం ద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో మంచిర్యాల జిల్లాలో సైతం కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళనలు వ్యక్తం అవుతు న్నాయి. కరోనాను రాకుండా అరికట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింట సర్వేను ప్రారంభించారు.

11 Corona Patients died in Bellampalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News