Sunday, May 5, 2024

యాసంగి వరి ధాన్యం కొనబోం : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనబోదని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి స్పష్టం చేశారు.శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో సిఎం కెసిఆర్ స‌మావేశ‌ం నిర్వహించారు. కొనుగోళ్లపై కేంద్రం తీరును రైతులకు వివరించాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం అమలు చేయలేదని సిఎం అన్నారు. వీటిని కొనసాగిస్తామని తెలిపారు.రాబోయే వానాకాలం పంటపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వానాకాలంలో పత్తి, వరి, కంది సాగుపై దృష్టి పెట్టాలని, రైతులను లాభసాటి పంటల సాగు దిశగా సమయాత్తం చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

CM KCR Review with Collectors at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News