Monday, April 29, 2024

వాణిజ్య గుదిబండ

- Advertisement -
- Advertisement -

జెట్ ఇంధనం, ఎల్‌పీజి వాణిజ్య గ్యాస్ ధరల పెంపు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా జెట్ ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్ ) , ఎల్‌పిజీ వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరలు పె రిగాయి. జెట్ ఇంధనం ధర 5.1 శాతం పెరిగింది. కిలో లీటరుకు రూ. 5779.84 వంతున పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 1,12,419 నుంచి రూ.1,18,199 కు చేరుకుంది. కోల్‌కతాలో కిలో లీటరుకు రూ.1,26, 697.08,ముంబై కిలో లీటర్ రూ. 1,10,592.31కి, చెన్నైలో కిలో లీటర్ రూ. 1,22,423. 92 కు పెరిగింది.

సెప్టెంబర్ 1న కూడా ఎటిఎఫ్ ధరల్లో పెరుగుదల నమోదైంది. జులై 1న కూడా ఏటీఎఫ్ ధర 1.65 శాతం పెంచారు. ఇలా జెట్ ఇంధనం ధర పెరగడం వరుసగా నాలుగోసారి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రెండు నెలలుగా తగ్గుతూ వచ్చిన ధర ఈసారి మాత్రం రూ. 209 కి పెరిగింది. అం తకు ముందు ఆగస్టు , సెప్టెంబర్ నెలల్లో దాదాపు రూ. 250 మేర తగ్గా యి. ఇప్పుడు దేశ రాజధా ని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1731కు పెరిగింది. కొత్త ధర ఆదివారం నుంచే అమలులోకి వ స్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News