Wednesday, May 1, 2024

రాఫెల్‌ డీల్‌పై జెపిసి దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Congress demands JPC probe into Rafale deal

ప్రధానికి కాంగ్రెస్ డిమాండ్
రాహుల్ చెప్పిందే నిజమైంది
ఫ్రాన్స్‌లో జడ్జితో దర్యాప్తు

న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు అత్యవసరం అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ఈ మేరకు ఆదేశాలు వెలువరించాలని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా శనివారం తెలిపారు. ఈ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి వ్యవహారాల నిగ్గు తేలాలి. ఇందుకు జెపిసి దర్యాప్తు అవసరం అని , ఈ విషయంలో ప్రధాని చొరవ తీసుకోవాలని రణదీప్ సూచించారు. ముడుపులపై రాహుల్ పేర్కొన్న అంశాలు నిజమేనని వెల్లడైందన్నారు. ఇండియాతో రూ 59,000 కోట్ల విలువైన రాఫెల్ ఫైటర్ జెట్స్ డీల్ విషయంలో భారీ స్థాయి అవినీతి, అంతకుమించి పక్షపాత ధోరణి నెలకొందని ఫ్రాన్స్‌లోనే ఇప్పుడు సంచలనాత్మక వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి అత్యున్నత స్థాయి జుడిషియల్ దర్యాప్తునకు ఓ ఫ్రెంచ్ జడ్జి నియామకం జరిగిందనే విషయాన్ని అక్కడి సంచలనాత్మక వెబ్‌సైట్ మీడియాపార్ట్ వెల్లడించిందని రణదీప్ గుర్తుచేశారు.

విమానాలు తయారు చేసే దేశంలోనే ఏకంగా ఈ వ్యవహారంపై జడ్జితో దర్యాప్తు చేపడుతున్నారని, దీనితో ఈ ఫైటర్స్ వెనుక భారీ అవినీతి ఉందనే విషయం స్పష్టం అవుతోందని తెలిపారు. భారీ అవినీతి గోల్‌మాల్ జరిగిందనే తమ పార్టీ నేత రాహుల్ గాంధీ వాదన ఇప్పుడు నిర్థారణ అయిందని, ఇక ప్రధాని మోడీ భేషజాలకు వెళ్లకుండా జెపిసి దర్యాప్తునకు ఆదేశాలు వెలువరించడం ద్వారా తమ పారదర్శకతను నిరూపించుకోవల్సి ఉందన్నారు. రాఫెల్ డీల్ జాతీయ భద్ర, ఉనికికి సంబంధించిన సున్నితమైన అంశం. దీనిపై స్వపక్ష విపక్ష భేదభావనలకు తావు ఇవ్వరాదని రణదీప్ స్పష్టం చేశారు. అవినీతి జరిగిందనే విషయాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం అంగీకరించి ఇప్పుడు నిజాలు తేలుస్తోంది. మరి ఇక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News