Sunday, May 12, 2024

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తూ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి పిలుపుమేరకు గురువారం కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పిసిసి సభ్యుడు గొట్టిముక్కల వెంగళ్‌రావు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి బస్టాప్ వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అందుకు సంబంధించిన వినతి పత్రాన్ని కూకట్‌పల్లి మండల తాహశీల్ధార్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వెంగళ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందన్నారు.

ప్రజలను ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ మరోమారు అధికారం కోసం తాపత్రేయం పడుతుందన్నారు. కెజి నుంచి పిజి ఉచిత నిర్భంద విద్య, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఇంటికో ఉద్యొగం, నిరుద్యోగ బృతి, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతు రుణ మాఫి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని గతంతో ఇచ్చిన వాగ్ధానాల అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా వెంగళ్‌రావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాఘవేంద్ర, గుడెపు నాగరాజు, సయీద్ మిస్బా, సునీల్ యాదవ్, శోభ, రజిత, జ్యోతి, మేకల రమేష్, ప్రవీణ్‌కుమార్, శాపుద్దీన్, నర్సిహ్మా యాదవ్, ఉదయ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News