Sunday, April 28, 2024

నకిలీ వైరస్‌తో అసలు కరోనా ఎత్తుగడలకు చెక్

- Advertisement -
- Advertisement -

Controlling original corona with fake virus

అమెరికా పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తల రూపకల్పన

వాషింగ్టన్ : మనుషుల శరీరాల్లోకి ప్రవేశించి అనేక ఎత్తుగడలతో కణ యంత్రాంగాన్ని మార్చి ఇన్‌ఫెక్షన్‌ను కలుగ చేస్తున్న కరోనా వైరస్‌ను అదే ఎత్తుగడలతో బోల్తా కొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అసలు వైరస్ తనకు తాను రెప్లికేట్ చేసుకుని వేల సంఖ్యలో పెరిగిపోకుండా అడ్డుకునే సింథటిక్ కరోనాను అభివృద్ధి చేశారు. ఇలాంటి వాటిని డిఫెక్టివ్ ఇంటర్‌ఫియరింగ్ ( డిఐ) వైరస్‌గా వ్యవహరిస్తారు. అంటే అసలు వైరస్‌ల పనిలో జోక్యం చేసుకుని వాటి సంఖ్యను తగ్గించడమే వీటి పని. ఈ సింథటిక్ వైరస్ అసలు వైరస్‌ను అంతం చేయడంతోపాటు తానూ అంతర్ధానమౌతుంది. సాధాఱంగా కరోనా వైరస్ శరీరం లోకి ప్రవేశించగానే మన కణాల్లోకి తన స్పైక్ ప్రొటీన్‌ను చొప్పించి తన ఆర్‌ఎన్‌ఎను కణం లోకి ప్రవేశ పెడుతుంది. ఆ ఆర్‌ఎన్‌ఎ ఆధారంగా మన కణాలు ఇబ్బడి ముబ్బడిగా కరోనా వైరస్‌లను ఉత్పత్తి చేస్తాయి. మన కణం భరించలేనన్ని వైరస్‌లు లోపల ఉత్పత్తి అయ్యాక అది పేలిపోయి, ఆ వైరస్‌లన్నీ కణం నుంచి బయటపడతాయి.

అవి మళ్లీ వేరే కణాల్లోకి తమ స్పైక్‌లను చొప్పించి తమ సంఖ్యను భారీగా పెంచుకుంటాయి. పరిశోధకులు సృష్టించిన డిఐ వైరస్‌లకు కూడా తమ సంఖ్యను పెంచుకునే వ్యవస్థ ఉంటుంది కానీ ఆమేరకు కావలసిన ప్రోటీన్లు ఉండవు. దీంతో అవి అసలు వైరస్ నుంచి ఆ ప్రోటీన్లను తీసుకుని సంఖ్యను పెంచుకోవడం ప్రారంభిస్తాయి. అంటే అసలు వైరస్‌ల పై పడి బతికే పరాన్న జీవుల వంటివిడిఐ వైరస్‌లు. అసలు వైరస్ కన్నా 3.3 రెట్ల వేగంతో ఇవి వృద్ధి చెందుతుండడంతో అసలు వైరస్ సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. డిఐ వైరస్‌లు పెరిగినా వాటి జన్యువుల్లో చేసిన మార్పుల వల్ల శరీరానికి హాని కలగదు. ఇలా ఒక దశ వచ్చే సరికి డిఐ వైస్‌ల సంఖ్య పెరుగుతూ పోయి, అసలు వైరస్‌ల సంఖ్య తగ్గుతూ చివరకు అంతరించి పోతాయి. అసలు వైరస్‌లు అంతరించ గానే తమకు కావలసిన జన్యు పదార్ధం దొరక్క డిఐ వైరస్‌లూ అంతరిస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News