Monday, April 29, 2024

గుర్తుతెలియని ఎగిరే వస్తువుపై బిఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు

- Advertisement -
- Advertisement -

BSF Personnel Open Fire At Unidentified Flying

జమ్మూ: జమ్మూ కశ్మీరులో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్ వద్ద ఒక గుర్తు తెలియని ఒక ఎగిరే వస్తువుపై సరిహద్దు భద్రతా దళం(బిఎస్‌ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అర్నియా సెక్టార్‌లో భూమికి 200 మీటర్ల ఎత్తులో ఒక ఎగిరే వస్తువు బిఎస్‌ఎఫ్ జవాన్ల కంటపడింది. వెలుగుతూ, ఆరుతున్న ఒక ఎర్ర దీపంతో కూడిన ఈ వస్తువును చూసిన జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. అయితే వెంటనే అది అక్కడి నుంచి వెళ్లిపోయిందని బిఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో బిఎస్‌ఎఫ్ సిబ్బంది గాలింపు జరుపుతున్నారని, ఇప్పటివరకు ఎటువంటి వస్తువు దొరకలేదని ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నెల 2న ఒక మానవరహిత హెలికాప్టర్ అర్నియా సెక్టార్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా బిఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపడంతో అది వెనక్కు వెళ్లిపోయింది. అదే విధంగా, జూన్ 27న జమ్మూ నగరంలోని భారతీయ వైమానిక దళం కేంద్రంపై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో రెండు బాంబులు విడువగా ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు.

BSF Personnel Open Fire At Unidentified Flying

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News