Friday, May 10, 2024

దేశంలో 71 లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona cases exceeding 71 lakhs in India

 

ఒక్కరోజే నమోదైన 66,733 కేసులు

71,559 మంది రికవరీ

కరోనా కాటుకు మరో 816 మంది మృతి

న్యూఢిల్లీ : దేశంలో మరో 66,733 కరోనా పాజిటివ్ కేసులు తాజాగా నమోదు కాగా గడచిన 24 గంటల్లో 71, 559 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. వరుసగా నాలుగవరోజు దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 9 లక్షల దిగువనే ఉందని, కోలుకున్న వారి సంఖ్య 61 లక్షలు దాటిందని కేంద్రం వివరించింది. దేశంలో ప్రస్తుతం 8,61,853 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారి సంఖ్య 61,49,535కు చేరుకుందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 71,20,538 మందికి కరోనా వైరస్ సోకగా కొత్తగా 816 మంది మరణించడంతో కరోనా వైరస్ కాటుకు బలైన వారి సంఖ్య 1,09,150కు చేరుకుంందని కేంద్రం తెలిపింది. మరణాల రేటు 1.53 శాతానికి తగ్గిపోగా రికవరీ రేటు 86.36కు పెరిగిందని తెలిపింది.

తాజాగా నమోదైన 816 మరణాలలో 309 మహారాష్ట్రలో, 75 కర్నాటకలో, 65 తమిళనాడులో, 59 పశ్చిమ బెంగాల్‌లో, 41 ఉత్తర్ ప్రదేశ్‌లో, 35 పంజాబ్‌లో, 30 ఆంధ్రప్రదేశ్‌లో, 29 ఢిల్లీలో చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు సంభవించిన మొత్తం 1,09,150 మరణాలలో 40,349 మహారాష్ట్రలో, 10,252 తమిళనాడులో, 9,966 కర్నాటకలో, 6,394 యుపిలో, 6,224 ఆంధ్రప్రదేశ్‌లో, 5,769 ఢిల్లీలో, 5,622 పశ్చిమ బెంగాల్‌లో, 3,833 పంజాబ్‌లో, 3,566 గుజరాత్‌లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News