Friday, April 26, 2024

చిరంజీవి ఆధ్వర్యంలో ‘సి.సి.సి. మన కోసం’

- Advertisement -
- Advertisement -

Corona Crisis Charity mana kosam

 

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుండి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకులు భారీగా విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుండి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు ముందుకు వచ్చి నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ ఛారిటీ మన కోసం’ (సి.సి.సి.మన కోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “కరోనా దెబ్బతో షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో సినీ కార్మికులను ఆదుకోవడం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో డి.సురేష్‌బాబు, నేను, ఎన్.శంకర్, కల్యాణ్, దాము కలిసి చిన్న కమిటీగా ఏర్పాటై ‘సి.సి.సి. మన కోసం’ సంస్థ ద్వారా సినీ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించాం.

దీనికి నాందిగా చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నాగార్జున కోటి రూపాయలు, ఎన్టీఆర్ 25 లక్షలు, రామ్‌చరణ్ 30 లక్షలు విరాళంగా అందజేశారు. వీరే కాకుండా ఎవరైనా సినీ కార్మికులను ఆదుకోవచ్చు. ఇక సినీ కార్మికుల సంక్షేమమే ఈ సంస్థ ముఖ్య ఆశయం”అని అన్నారు. ఎన్.శంకర్ మాట్లాడుతూ “కరోనా క్రైసిస్ ఛారిటీకి మెగాస్టార్ చిరంజీవి ఛైర్మన్‌గా ఉంటారు. ఈ సంస్థ సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, డి.సురేష్‌బాబు, సి.కల్యాణ్, దాము, బెనర్జీ, నేను సభ్యులుగా ఉంటాము.

సి.సి.సి. మన కోసం కమిటీతో పాటు దర్శకుడు మెహర్ రమేష్, గీతా ఆర్ట్ బాబు, కోటగిరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, కొమరం వెంకటేష్, ఫెడరేషన్‌కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయకులు అందరూ ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇక కరోనాను అంతమొందించే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ సేవా కార్యక్రమానికి సిఎం కెసిఆర్ ఆశీస్సులు, మంత్రి కెటిఆర్ అండదండలు, ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ వారి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాం”అని తెలిపారు.

 

Corona Crisis Charity mana kosam for film workers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News