Friday, May 10, 2024

అంబర్‌పేటలో యువతికి కరోనా పాజిటివ్ లక్షణాలు

- Advertisement -
- Advertisement -

Corona

 

మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో కరోనా విజృంభణ రోజు రోజుకు కరాళానృత్యం చేస్తుంది. శనివారం అంబర్‌పేట్‌లోని గంగానగర్‌లో నివసించే నర్సుకు వైరస్ సోకినట్లు తేలింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కానీ వారు తమ ఇంట్లో పెంచుకున్న కుక్కకు కూడా కరోనా ఉండవచ్చని పేర్కొంటూ దానిని కూడా క్వారంటైన్‌కు తీసుకెళ్లాలని పట్టుబట్టారు. కుక్కను తీసుకెళ్లి డాక్టరుకు చూపిస్తే తప్ప మేము రాలేమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించగా కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించడానికి ఉపక్రమించారు. తమకు వచ్చిన వైరస్ కంటే కుక్క జీవితమే ముఖ్యమంటూ అధికారులకు తేల్చిచెప్పారు. వీరి జంతు ప్రేమను చూసి వైద్య సిబ్బంది ఏంచేయాల్లో అర్దంకాక ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటున్నారు.

 

Corona positive symptoms for young woman in Amberpet
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News