Friday, May 3, 2024

ఎపి గవర్నర్‌కు పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Corona to AP Governor Biswabhusan Harichandan

 

ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు

ఆంధ్రపదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్,, హైదరాబాద్‌లోని ఎఐజి ఆసుపత్రిలో చేరిక, గవర్నర్ తమిళిసై పరామర్శ
ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న సిఎం కెసిఆర్, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాల వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు బుధవారం నాడు ఎఐజి ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఊపిరితిత్తులలో సమస్య తలెత్తడంతో గవర్నర్ బిశ్వభూషణ్ తీవ్ర అనారోగ్యం పాలయినట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో బిశ్వభూషణ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. బిశ్వభూషణ్‌కు భార్య సుప్రవ హరిచందన్, కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైయ్యారని, స్థానిక వైద్యులు పరీక్షలు నిర్వహించి కరోనా సోకినట్లు నిర్థారించారు. కాగా ఎఐజి డాక్టర్లు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేస్తామని వివరించారు. ఇదిలావుండగా 2019 జూలై 24న ఎపి గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

గవర్నర్ ఆరోగ్యంపై సిఎం ఆరా..!

గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్యంపై ఎపి సిఎం జగన్ ఆరా తీశారు. ఎఐజి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో నేరుగా ఫోన్‌లో సీఎం మాట్లాడి గవర్నర్ ఆరోగ్య పరిస్ధితి, అందిస్తున్న వైద్యంపై వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ నాగేశ్వర రెడ్డి తెలిపారు. కాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెద్యులు వెల్లడించారు. గవర్నర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం గవర్నర్ హరిచందన్ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యలు వెల్లడించారు. హరిచందన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందని త్వరలో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News