Sunday, April 28, 2024

18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ క‌రోనా వ్యాక్సిన్‌

- Advertisement -
- Advertisement -

Corona vaccine for all over the age of 18

న్యూఢిల్లీ: క‌రోనా వ్యాప్తి ఉదృతమవుతున్న తరుణంలో కరోనా కట్టడికి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. వ్యాక్సినేష‌న్ మూడో ద‌శ‌లో భాగంగా వేగం పెంచాల‌నే ఉద్దేశంతో ఈ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తున్న త‌రుణంలో సోమ‌వారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ వ‌రుస స‌మావేశాల్లో పాల్గొన్నారు. ఈ స‌మావేశాల్లోనే 18 ఏళ్ల పైబ‌డిన అంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థలను ప్రోత్సహించడంతో పాటు, అంతర్జాతీయ కంపనీల నుంచి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News