Friday, April 26, 2024

టక.. టక.. టీకా..

- Advertisement -
- Advertisement -

సోమవారం నుంచి ప్రారంభం
15 18 సంవత్సరాల వారికి
15 రోజుల పూర్తిస్థాయి టీకాలు
ఉమ్మడిజిల్లాలో 3లక్షల పైచిలుకు గుర్తించిన అధికారులు

Corona vaccine for youth in Surya pet

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతోంది. కోవిడ్ 19 వల్ల ఇప్పటికే రెండు సంవత్సరాలు విద్యార్థులు నష్టపోయారు. డిసెంబర్ 31, 2021 వేడుకలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా 15 18 సంవత్సరాలలోపు యువకులు టీకా తీసుకోనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి 15 రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టక .. టకా.. టీకాలు వేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో లక్ష 75 వేల మంది, సూర్యాపేట జిల్లాలో 71 వేల మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 64,500 మందికి టీకాలు తీసుకోనట్లు గుర్తించారు. మొదటి డోస్ తీసుకున్న వారు రెండో తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఒమిక్రాన్ వైరస్ అధిక మొత్తంలో వ్యాపిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో గ్రామ స్థాయి నుంచి ఇప్పటికే సిబ్బంది పూర్తి వివరాలు సేకరించారు. తదనుగుణంగా టీకా డోస్‌లను కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేశారు. 15 18 ఏళ్ల వయస్సుతో పాటు 60 సంవత్సరాలు దాటిన వారు కూడా ఏమైన సమస్యలు ఉన్నప్పటికీ వైద్యాధికారులపర్యవేక్షణలో టీకాలు వేయనున్నారు. 60 ఏళ్లు దాటిని వారికి ఈ నెల 10 నుంచి టీకాల వేయనున్నట్లు తెలుస్తోంది. 60ఏళ్లు పైబడిన వారిలో నల్లగొండ జిల్లాలో లక్ష 30 వేల 500 మంది, సూర్యాపేట జిల్లాలో లక్ష రెండు వేల మంది, యాదాద్రి జిల్లాలో 97 వేల మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.
ప్రచారంలో ముందంజ
ఉమ్మడి జిల్లాలో మొదటి డోస్ టీకా తీసుకొని ఇంకా రెండో డోస్ తీసుకొని వారు ఉన్నట్లయితే వారికి రెండో డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 15 శాతం పై చిలుకు రెండో డోస్ తీసుకొనట్లు తెలుస్తోంది. టీకా తీసుకొని వారిని గుర్తించి టీకా ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు కూడా ఉన్నట్లయితే వారికి కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్లకు సైతం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం నుంచి టీకా : డాక్టర్ వెంకటరమణ
ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండడంతో ఇప్పటికీ టీకా తీసుకొని వారు 15 18 సంవత్సరాలలోపు వారిని గుర్తించామన్నారు. సోమవారం నుంచి టీకాలు వేయిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల లో ఇప్పటికే అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని గుర్తించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి గ్రామాలలో తిరుగుతూ అవగాహన కల్పించారని, సిబ్బంది గ్రామాలలో పర్యటించినప్పుడు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు టీకా వేసుకొని వారిని గుర్తించి సహరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News