Friday, April 26, 2024

మళ్లీ కరోనా భయం

- Advertisement -
- Advertisement -

చాప కింద నీరులా మళ్ళీ విస్తరిస్తున్న కరోన మహమ్మరి
ఒక వైపు వ్యాక్సిన్… మరోవైపు పాజిటివ్ కేసులు
రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన
వేసవి తీవ్రతతోపాటు పెరుగుతున్న కొవిడ్ కేసులు

Corona virus more spread in Khammam

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి:  ఉమ్మడి జిల్లాకు మళ్లీ కరోన భయం పట్టుకుంది. సరిగ్గా గత ఏడాది ఇదే నెలలో జిల్లాకు వ్యాపించిన కరోనా వైరస్ మళ్ళీ ఇప్పుడు చాపకిందనీరులా విస్తరించడం ప్రారంభించింది. గడిచిన పక్షం రోజులుగాఅంతకు అంతగా పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే విద్యాలయాలను మూసివేయడం…త్వరలో సినిమా హాళ్ళను మూసివేస్తారని ప్రచారం జరుగతుండటంతో మళ్లీ లాక్‌డౌన్ తప్పదేమోననే భయం ప్రజలను వెంటాడుతుంది. ఒక వైపు కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్‌కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుండగా ఇంకోవైపు పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అటూ దేశంలో, ఇటూ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పాజిటివ్ కేసుల నమోదు భారీగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ ను పాటిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు మళ్ళీ లాక్‌డౌన్ భయం పట్టుకుంది.

దేశంలో మహరాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌గఢ్ వంటి అనేక రాష్ట్రాల్లో మళ్లీ కరోనా పంజా విస్తరించడం ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్ సమీపంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉంది.అంతేగాక మహారాష్ట్ర,కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ నుంచి వేలాది మంది వలస కూలీలు జిల్లాకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. దీంతో ఈవేసవిలో మిర్చి ఎరడం, వరి కోతలు ఇతరాత్ర పనుల నిమిత్తం ఇప్పటికి వలస కూలీలు వస్తున్నారు. అయితే వారి ద్వారా మళ్లీ వైరస్ వ్యాప్తి చెందవచ్చే ప్రమాదం పొంచి ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెల14వతేదిన కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురంలో ఇటలీ నుంచి వచ్చిన ఒక యువతి ద్వారా జిల్లాకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు కాగా, రాష్ట్రంలోనే రెండో పాజిటివ్ కేసుగా రికార్డులోకి ఎక్కింది. తరువాత ఏఫ్రిల్ 6వ తేదిన ఖమ్మం నగరంలో తొలి కేసు నమోదు అయ్యింది.

ఇప్పుడు మళ్ళీ ఇదే నెలలో కొవిడ్ మహమ్మరి విజృంబిస్తుండటం గమనర్హం. ఇటీవల కాలంలో ఒకటి ఆర కేసులు నమోదు అయినప్పటికి ఇప్పుడు చాపకింద నీరులా తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న పాఠశాలల విద్యార్థులు సైతం కరోనా బారిన పడుతుండటంతో ఏకంగా విద్యాలయాలన్నింటిని మూసివేశారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను తెరిచిన విషయం తెలిసిందే, ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో 25మంది విద్యార్థ్ధులకు, 13మంది ఉపాధ్యాయులకు కరోనా వైరస్ సోకింది. బోనకల్, ముదిగొండ, చింతకాని, మధిర, వైరా, కామేపల్లి మండలాల్లో పాజీటివ్ కేసులు నమోదు పెరుగుతున్నందునా ముందుచూపుగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో బుధవారం నాడు గురుకులాలలో, ఆశ్రమ పాఠశాలల్లో, ప్రభుత్వ వసతి గృ హాల్లో ఉన్న విద్యార్థ్దులంతా వారి స్వగ్రామాలకు చేరుకున్నారు.

కే వలం విద్యార్థు లనే కాకుండా మళ్ళీ అందరిపై ముప్పెట దాడి చేయడం ప్రారంభించింది. ఖమ్మం నగరంలో 5వ డివిజన్‌లో ప్రశాంతినగర్‌లో బుధవారం ఒకే రోజే ఎడుగురికి పాజిటివ్‌గా నమోదు అయ్యింది. అదేవిధంగా గట్టయ్యసెంటర్‌లోని ఒక అపార్టమెంట్‌లో 20మందికి వ్యాపించింది. హవేలి పోలీస్‌స్టేషన్లో పనిచేసే 8మంది కానిస్టేబుళ్ళకు సైతం వైరస్ వ్యాపించింది. ఒక ఎ ఎస్ ఐ,హెడ్ కానిస్టేబుళ్ళతోపాటు ఆరుగురు కానిస్టేబుళ్ళకు పాజిటివ్ సోకింది. అదేవిధంగా రఘునాధపాలేం పోలీస్‌స్టేషన్లో పనిచేసే హోంగార్డ్‌కు కూడా పాజిటివ్ వచ్చింది. వీరంతా ఇటివల మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ జాతర బందోబస్తుకు వెళ్లి వచ్చారు. భధ్రాద్రి జిల్లాతో పోలీస్తే ఖమ్మం జిల్లాలోనే అధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు ఈ జిల్లాలో 21122 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 239మందికి పాజీటివ్‌గా నిర్ధ్దారణ జరిగింది. ఈఏడాది జనవరిలో 22938మందికి పరీక్షలు చేస్తే 489 మందికి పాజిటివ్‌గా తేలగా, ఫిబ్రవరిలో 15825మందికి పరీక్షలు నిర్వహిస్తే 139మందికే పాజిటివ్‌గా నివేధికలు వచ్చాయి.

మంగళవారం ఒక రోజే 30మందికి పాజిటివ్ నిర్ధారణ జరగడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మళ్లీ 30 పడకలను కరోనా వారి కోసం సిద్ధ్దం చేశారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటిన్‌లో ఖమ్మం జిల్లాలో 9పాజిటివ్ కేసులు నమోదు కాగా, భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఖమ్మం జిల్లాలో గడిచిన వారం రోజుల్లో 70 కేసులకుపైగా నమోదు కావడం గమనర్హం. అంతకుముందు జీరో కేసులు ఉన్న ఈ జిల్లాలో ఈనెల17న 9 ఈనెల 18న 8,19న7, 20న17,21న9,22న11, 23న 9 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల17న 5 ఈనెల 18న 3,19న4,20న5,21న4,22న6,23న 4 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఐసియులో దాదాపు 16 మంది చికిత్స పొందుతుండగా నాలుగు ప్రయివేట్ ఆసుపత్రుల్లో 18మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఖమ్మం నగరంలోని ఆరోగ్య ఆసుపత్రిలో 8మంది, తేజస్వీని ఆసుపత్రిలో 4, న్యూలైఫ్, సంకల్ప సిస్టార్ ఆసుపత్రిలో ఇద్దరు చొప్పున కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిఖిత ఆసుపత్రిలో ఒక్కరు చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజుల వరకు ఈ జిల్లాలో జిరో కేసులు నమోదు కాగా. పినపాక,పెనగడప, భద్రాచలం పిహెచ్‌సి పరిధిలో కేసులు నమోదు కావడం ప్రారంభం అయ్యాయి. పినపాక గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఏరోజు 30మందికి పాజిటివ్ రావడంతో గ్రామంలోస్వచ్చందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. పాల్వంచలో ఒక బ్యాంక్ మేనేజర్‌కు సైతం పాజిటివ్‌గా తేలింది. ఈ జిల్లాలో బుధవారం 859మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా8మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 301914 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో21339మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది.

ఇటీవల కాలంలో కరోనా పూర్తి స్థ్ధాయిలో తగ్గిందనే భావనతో ప్రజలు గత కొన్ని రోజుల నుంచి నిర్లక్షంగా వ్యహరిస్తున్నారు. సామాజిక దూరం పాటించకపోవడం,మాస్క్‌లు లేకుండానే విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆ నిర్లక్షం వల్లనే ఇటీవల మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఒక వైపు కోవిడ్ నివారణకోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్ని పిహెచ్‌సిలో ముమ్మరంగా కొనసాగుతున్న పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అశ్చరకరమైన విషయం ఏమిటంటే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం మళ్లీ పాజీటివ్ గా నివేధికలు రావడం గమనర్హం. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 40వేల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో ఫ్రింట్ లైన్ వారియర్‌గా ఉన్న మున్సిపల్,పంచాయతీ పారిశుద్ధ్ద కార్మికులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది 3323మంది మొదటి డోస్ తీసుకోగా 1905 మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అదేవిధంగా 8785మంది హెల్త్ కేర్ వర్కర్లు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.ఇందులో 5658మంది రెండో డోస్ కూడా తీసుకున్నారు.ఇక 60 ఏళ్ళు పైబడిన వృద్ధ్దుల్లో 6347మంది, 45 నుంచి 59 ఏళ్ళ మధ్య ఉన్న వారు 22243మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. బుధవారం ఒక్కరోజే ఖమ్మం జిల్లాలో 1043 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో 73మంది హెల్త్ వర్కర్లు, 60మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో 737మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News