Saturday, May 4, 2024

ప్రైవేటు బడుల్లో కోవిడ్ నిబంధనలు గాలికి…

- Advertisement -
- Advertisement -

పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిన పట్టించుకోని పరిస్దితి
గుంపులుగా విద్యార్ధులను ఒకేదగ్గర చేరుతున్న సిబ్బంది
శానిటైజర్, మాస్కులు కనిపించిన పాఠశాలలు
వైరస్‌పై భయాందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
విద్యాశాఖ స్కూళ్లను తనిఖీ చేయాలంటున్న విద్యార్థి సంఘాలు

Corona virus spread in Private schools
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో విద్యా సంస్దలు గత మాసంలో ప్రారంభించి పక్షం రోజుల పాటు కరోనా నిబంధనలు పాటించి తరువాత ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శానిటైజర్, మాస్కులు అందుబాటులో ఉంచకపోవడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భయంగా బడులకు పంపిస్తూ కరోనా జాగ్రత్తలు పాటించకుంటే వైరస్ ప్రభావం చూపుతుందని, గత మూడు నెల నుంచి నగరంలో 60 నుంచి 70వరకు పాజిటివ్ కేసులు నమోదైతున్నాయి. మరోపక్క వర్షాలు మహనగరానికి వదలడం లేదు. రోజుకో చోట కురుస్తుండటంతో సీజన్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. చాలామంది చిన్నారులు దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఉంటడంతో తోటి విద్యార్ధులకు సోకే పరిస్దితి ఉంటుందంటున్నారు. ప్రస్తుతం రోజు రోజుకు విద్యార్దుల సంఖ్య పెరగడంతో కోవిడ్ నిబంధనలు పాటించకుంటే పిల్లలను బడులకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు.

ఒక బెంచీల్లో ముగ్గురి కంటే ఎక్కువ విద్యార్దులను కూర్చోబెట్టి, బౌతికదూరం ఉండేలా చూడటంలేదని చెబుతున్నారు. కొందరు విద్యార్ధులు మాస్కులు సక్రమంగా ధరించకుంటే పెట్టుకోవాలని కూడా సూచనలు చేయడం లేదని, ప్రతి విద్యార్దిని ఈవిద్యాసంవత్సరానికి చెందిన ఫీజులు చెల్లించారని అడుగుతూ వేధింపులు చేయడం తప్ప వైరస్ పట్ల నిర్లక్షం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం బోజనం కూడా ఒకే దగ్గర గుంపులుగా ఉండి చేయాల్సి వస్తుందని, అందులో జలుబు, దగ్గు లక్షణాలున్నవారినికూడా గుర్తించడంలేదంటున్నారు. సాయంత్రం స్కూళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మెట్లపై ఒకేసారి గుంపులు వస్తున్నట్లు, క్యూ పద్దతిలో వచ్చే విధంగా చూడటం లేదని చెబుతున్నారు. రెండు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో అందరిని చూసుకోవడం భారంగా మారడంలో కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఫీజులు పూర్తిగా చెల్లించడంతో చిన్నారులను ఇంటి వద్ద ఉంచలేమని, మళ్లీ వైరస్ విరుచుకపడుతుందనే భయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 689 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలుండగా వాటిలో 1.10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈస్కూళ్లలో 90 శాతం మంది విద్యార్దులు తరగతులకు హాజరైతున్నారు. ప్రైవేటు స్కూళ్లు 1875 ఉండగా వాటిలో 7.39లక్షల మంది విద్యార్దులుండగా ఇప్పటికి 60శాతం కూడా హాజరు నమోదు కావడంలేదని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కొంతమంది విద్యార్దులు వారం రోజుల్లో మూడు రోజులు మాత్రమే తరగతులకు హజరైతున్నారు. దసరా పండగ ముగిసేవరకు వైరస్ పట్ల జాగ్రత్తంగా ఉంటామని విద్యార్ధులు చెబుతున్నారు. విద్యాశాఖ కోవిడ్ నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News