Tuesday, April 30, 2024

సాగు చట్టాలపై స్టే ఇచ్చాక… ఇంకా నిరసనలేమిటి?

- Advertisement -
- Advertisement -

supremecourt

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సేద్యపు చట్టాలపై ఇప్పటికే స్టే ఇచ్చాక కూడా ఇంకా నిరసనలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు రైతు సంఘాలను ప్రశ్నించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుత ‘సత్యాగ్రహం’ చేపట్టేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైతు సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణను చేపట్టి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యలు చేసింది.

విచారణ సందర్భంగా యూపిలోని లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనను అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కోర్టు ముందు ప్రస్తావించారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవ్వరూ బాధ్యత వహించరని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను అక్టోబర్ 21న చేపడతామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News