Saturday, May 11, 2024

కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీలోనే: ఈటెల

- Advertisement -
- Advertisement -

Gandhi-Hospital

 

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విజృంభిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గాంధీ మెడికల్ కళాశాలలో లైబ్రరీ భవనాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. గాంధీ మెడికల్ కళాశాలలో ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. గాంధీ మెడికల్ కళాశాలలో సోమవారం నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమవుతాయని ఈటెల మీడియాతో తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత పది రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం పూణెకు పంపుతున్నామని, ఇప్పుడు గాంధీ ఆస్పత్రిలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించామని తెలియజేశారు. కరోనా వైరస్ నిర్ధారణ కోసం కిట్‌లను కేంద్రం పంపిణీ చేసిందని, ల్యాబ్‌లో కిట్స్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఫీవర్, చెస్ట్, గాంధీలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని, ఉస్మానియా, కోఠి మెటర్నిటీ ఆస్పత్రిల్లో కొత్త విభాగాలు ప్రారంభమవుతాయని ఈటెల స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజులు మాత్రమేనని, చైనా నుంచి వచ్చిన వారికి 14 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని పేర్కొన్నారు. ఎపి, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఇక్కడే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

 

Corona Virus Tests in Gandhi Hospital in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News