Saturday, September 21, 2024

కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరణ

- Advertisement -
- Advertisement -

Covid-19

ఎల్బీనగర్, అత్తాపూర్, ఎస్‌ఆర్‌నగర్‌లో పాజిటివ్ కేసులు
భయాందోళనకు గురౌతున్న స్థానిక ప్రజలు

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి కొత్త ప్రాంతాల్లో తన ఉనికి చాటుతూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే వనస్థలిపురంలోని సాయి హుడానగర్, ద్వారకానగర్, సచివాలయనగర్, ఎస్‌కెడినగర్‌లు కరోనా ఘంటికలతో కంటైన్‌మెంట్ జోన్‌లోకి వెళ్లడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటివరకు ఎల్బీనగర్ జోన్‌లోని వనస్థ్దలిపురం, హయత్‌నగర్, బిఎన్‌రెడ్డినగర్, కర్మన్‌ఘాట్, నాగోల్, ఉప్పల్ సర్కిళ్లలో 57 కేసులు పాజిటివ్‌గా బయటపడగా 5మృతి చెందారు.

శనివారం ఎస్‌ఆర్‌నగర్‌లో కొబ్బరి బొండాల వ్యాపారికి పాజిటివ్ తేలిగా, అంబర్‌పేట చెన్నారెడ్డినగర్‌కు చెందిన మరో కుటుంబానికి లక్షణాలు కనిపించినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. అదే విధంగా అత్తాపూర్ డివిజన్‌లో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంట్లోనే ఏడుగురికి సోకింది. గ్రేటర్ నగరంలో ఇంతకు ముందు లేని ప్రాంతాలకు వైరస్ వ్యాపించడంతో ఆందోళన కలిగిస్తోంది.

Coronavirus Expansion to New Areas in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News