Sunday, May 5, 2024

ప్రేమ వ్యవహారం… జంటను నగ్నంగా ఊరేగించారు…

- Advertisement -
- Advertisement -

 

 

రాంఛీ: ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నరనే ఆరోపణలతో  యువతి, యువకుడిని తీవ్రంగా కొట్టి నగ్నంగా ఊరేగించిన సంఘటన ఝార్ఖండ్ లోని షిహిబ్ గంజ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువకుడు యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నడనే అనుమానంతో యువతి, యువకుడిని గ్రామస్థులు పట్టుకొని తీవ్రంగా కొట్టి నగ్నంగా ఊరేగించారు. అంతేకాకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ యువకుడికి గ్రామ పెద్దలు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి గ్రామ పెద్దలను అదుపులోకి తీసుకున్నామని డిఎస్పి ప్రమోద్ కుమార్ మిశ్రా తెలిపాడు. ఆ జంటపై దాడి చేసిన కొందరు నిందితులు పరారీలో ఉన్నారని డిఎస్ పి తెలిపాడు. వాళ్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన జంటను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News