Home కరీంనగర్ కాకతీయ కాలువలో కారు బోల్తా.. దంపతులు మృతి

కాకతీయ కాలువలో కారు బోల్తా.. దంపతులు మృతి

కరీంనగర్: ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడి దంపతులు మృతి చెందిన ఘటన జిల్లాలో తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన మాచర్ల శ్రీనివాస్ గౌడ్, స్వరూప దంపతులు తమ వ్యక్తిగత పనికోసం సుల్తానాబాద్ నుంచి కరీంనగర్‌కు తమ కారులో వచ్చారు. కరీంనగర్‌లో పని ముగించుకున్న అనంతరం చేపలు కొనేందుకని అల్గునూర్‌లోని కాకతీయ కాలువ దగ్గరుకు వచ్చారు. చేపలు కొనుక్కొని తిరిగి వెళ్లే క్రమంలో కారును రివర్స్ తీస్తుండగా అదుపుతప్పిన కారు కాకతీయ కాలువలో జారి పడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కారును నీటిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ ఎసిపి విజయసారథి, తిమ్మాపూర్ సిఐ మహేశ్ గౌడ్, ఎల్‌ఎండి ఎస్‌ఐ నరేశ్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును కాలువలోంచి బయటకు తీశారు. అప్పటికే కారులో ఇరుక్కుపోయిన శ్రీనివాస్, స్వరూప దంపతులు ఊపిరాడక చనిపోయారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Couple Dies after a Car falls into Kakatiya Canal