Monday, May 6, 2024

హిందువులపై వ్యాఖ్యలు: ఎంపి అజ్మల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుకు కోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

గువాహటి: హిందూ పురుషులు, మహిళలపై వివాదాస్పద వయాఖ్యలు చేసిన లోక్‌సభ సభ్యుడు బద్రుద్దీన్ అజ్మల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవలసిందిగా గువాహటి పోలీసులను అస్సాంలో కామరూప్ జిల్లా కోర్టు శుక్రవారం ఆదేశించింది. డిసెంబర్ 2న ఒక వార్తాపత్రికకు ఇంటర్వూ ఇచ్చిన ఎంపి అజ్మల్ అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మతోపాటు హిందూ పురుషులు, మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలతో సమానంగా పిల్లలను కనడానికి హిందువులు చిన్నయ వయసులో ఉన్న యువతులను పెళ్లి చేసుకోవాలంటూ అజ్మల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

దీంతో తన వ్యాఖ్యలపై వివాదం రేగడం చూసి సిగ్గుపడుతున్నానని అంటూ మరుసటి రోజు క్షమాపణ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను ఏ మతాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేయలేదని ఆయన సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. కాగా..అజ్మల్‌పై అస్సాం జాతీయ పరిషద్ ఉపాధ్యక్షుడు దులూ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రత్యేక జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రాణ్‌జిత్ హజారికా గువాహటిలోని హతిగావ్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్‌కు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షుడైన అజ్మల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News