Saturday, April 27, 2024

కరోనా వేరియంట్ల నుంచి కొవాగ్జిన్ బూస్టర్ డోస్‌తో అత్యంత రక్షణ

- Advertisement -
- Advertisement -

Covaxin's booster dose demonstrates immunity

భారత్ బయోటెక్ సంస్థ వెల్లడి

హైదరాబాద్ : కరోనా వైరస్ వేరియంట్ల నుంచి తట్టుకుని భద్రత కల్పించడంలోను వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం లోను తాము తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ బాస్టర్ డోసు సమర్ధంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో రుజువైందని ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ బుధవారం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ నిర్వహించిన అధ్యయనాన్ని ఆమోదించి నేచర్ సైంటిఫిక్ రిపోర్టు అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ మేరకు భారత్ బయోటెక్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మొత్తం 184 అంశాలపై ఈ అధ్యయనం సాగింది. అధ్యయనం లో పాల్గొన్న వారికి మొదట రెండు డోసుల తరువాత ఆరు నెలలకు యాధృచ్ఛికంగా 1:1 నిష్పత్తిలో కొవాగ్జిన్ బూస్టర్ డోసు లేదా ప్రభావం లేని వ్యాక్సిన్‌ను ఇవ్వడమైందని వివరించారు. ఈ బూస్టర్ డోసు కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా యాంటీబాడీల స్పందనను తటస్ఠీకరించడమే కాకుండా, మెమరీ టి, బి కణాల ద్వారా సుదీర్ఘకాలం రక్షణ కల్పిస్తున్నట్టు తేలిందని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ణ యెల్లా వివరించారు.

కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా సమర్ధవంతమైన, సుదీర్ఘకాల సురక్షిత లక్షాన్ని తాము సాధించగలిగామని తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన కొవాగ్జిన్ అదే మొదటిడోసుగా, బూస్టర్ డోసుగా పెద్దలకు , పిల్లలకు ఇవ్వవచ్చని, సార్వత్రిక టీకాగా దీన్ని రూపొందించడమైందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ లిక్విడ్ వ్యాక్సిన్‌గా వినియోగించడానికి సిద్ధంగా ఉందని, 28 డిగ్రీల సెల్సియస్‌లో 12 నెలల పాటు నిల్వ చేయవచ్చని, అనేక డోసుల టీకాగా వినియోగించ వచ్చని చెప్పారు. ఎప్పుడు అవసరం వచ్చినా పంపిణీకి వీలుగా దాదాపు 50 మిలియన్ డోసుల నిల్వతో భారత సిద్ధంగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News