Sunday, May 5, 2024

భయాందోళనలో భాగ్యనగరం!

- Advertisement -
- Advertisement -

Covid-19 Cases Rise in Hyderabad

గ్రేటర్‌లో ఒక్కరోజే 400 పాజిటివ్ కేసులు
మరింత పెరిగే అవకాశమున్నట్లు వైద్యశాఖ హెచ్చరికలు
కేసుల నమోదయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్స కోసం ఏర్పాట్లు వేగం
నగర ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే ముప్ప తప్పదంటున్న వైద్యులు

హైదరాబాద్: గ్రేటర్ నగరం కరోనా విజృంభణతో గజగజ వణుకుతుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. మంగళవారం ఒకరోజే ఊహించని విధంగా 393 మందికి వైరస్ సోకడంతో నెలాఖరు వరకు రెండింతలు పెరగవచ్చని వైద్యాధికారులు భావిస్తున్నారు. గత పదిరోజుల నుంచి ఎక్కువ మొత్తంలో కేసులు నమోదైనట్లు, ఆప్రాంతాలను కంటైన్‌మెంట్లు జోన్లుగా ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి రెండోవారంలో పాఠశాల, కళాశాల, వసతి గృహాలకు చెందిన విద్యార్దులతో ప్రారంభమైన రెండవ దశ వైరస్ నేటివరకు రెక్కలు కట్టుకని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అంతేగాకుండా కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న పో లీసు సిబ్బందిని కూడా వైరస్ వదలడం లేదు.

బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ సహా 11మందికి పాజిటివ్ తేలింది. ఈపరిమాణాలతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఏమాత్రం నిర్లక్షం వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకుతుండటంతో అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు కిందిస్దాయి సిబ్బంది చెబుతున్నారు.దీంతో జిల్లా వైద్యాధికారులు గడిచిన ఏడాదిలో కరోనా రోగులకు సేవలందించిన ఫీవర్, నిజామియా, నేచర్‌క్యూర్, చెస్ట్, ఆయుర్వేద, గాంధీ ఆసుపత్రుల్లో మళ్లీ రోగులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. త్వరలో క్వారంటైన్ సెంటర్లుగా మార్చి నాణ్యమైన వైద్యం అందించి, మరణాలు రేటు తగ్గిస్తామని వైద్యులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని, జాగ్రత్తలు పాటించకపోతే నగరానికి ముప్పు తప్పదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

పాజిటివ్ కేసులు కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, అల్వాల్, మల్కాజిగిరి, బోడుప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేట, గొల్కొండ, షేక్‌పేట వంటి ప్రాంతాల్లో పెరుగుతున్నట్లు అక్కడ నివసించే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా లేకుంటే వైరస్ బారినపడుతారని పేర్కొంటున్నారు. ఈనెలలో నమోదైన పాజిటివ్ కేసులు వివరాలు చూస్తే ఈనెల 1వ తేదీన 254 కేసులు, ఈనెల 2న 283 మందికి, ఈనెల 3వ తేదీన 320కేసులు, ఈనెల 4న 302 మందికి ఈనెల 5వ తేదీన 312 కేసులు, ఈనెల 6న 398 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి, ఇప్పటికే నగరంలో పలు ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కోసం బారులు కడుతున్నారు.

మరో పక్క కేంద్ర ఆరోగ్యశాఖ 45సంవత్సరాలకు పైబడిన వారందరు కరోనా టీకా తీసుకోవచ్చని ప్రకటన చేయడంతో ఐదారు రోజుల నుంచి వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బారులు కడుతున్నారు. వైరస్ వేగంగా సోకుతుండటంతో ముందుస్తు జాగ్రత్తలో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు స్దానిక ప్రజలు పేర్కొంటున్నారు. నగర ప్రజలు ఇష్టానుసారంగా రోడ్లపై తిరగకుండా అత్యవసర పరిస్దితుల్లో బయటకు వెళ్లాలని, ముఖానికి మాస్కులు, దుకాణాలకు వెళ్లితే భౌతికదూరం పాటించాలని, సరదా కోసం అడ్డగోలుగా తిరిగే కరోనా కాటుకు బలికాక తప్పదని జిల్లా వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News