Friday, May 3, 2024

రాష్ట్రంలో కాసేపట్లో ప్రారంభంకానున్న డ్రైరన్

- Advertisement -
- Advertisement -

covid-19 vaccine dry run in telangana

నగరంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసిన వైద్యశాఖ
ఒక్క సెంటర్‌లో మూడు సెషనల్లో వ్యాక్సిన్ ప్రక్రియ
టీకా తరలింపు, స్టోరేజీ, వివరాలు యాప్‌లో నమోదు చేయడం
వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచుతామని వైద్యశాఖ వెల్లడి

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ముందు టీకా ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేసేందుకు వైద్యశాఖ సన్నద్ధ్దమైతుంది. ఇప్పటికే సిబ్బంది వివరాలు సేకరించి కేంద్ర ఆ రోగ్యశాఖ అందజేయడంతో వారికి నేటి నుంచి వ్యాక్సిన్‌పై డ్రై రన్ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన లక్ష మంది సిబ్బంది ఉండగా, అందులో 42వేల మందికి తొలిదశలో టీకా వేయనున్నారు. అందుకోసం వీరికి డ్రైరన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లు, ప్రణాళికను అమలు చేయడంలో సాధ్యసాధ్యాలు, వ్యాక్సిన్ రవాణా,క్షేత్రస్దాయి సిబ్బందికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొంది స్తామని పేర్కొంటున్నారు. నగరంలో గాంధీ ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, తిలక్‌నగర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్ర, సోమాజిగూడ యశోద ఆసుపత్రుల్లోని డ్రైరన్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఒక్కో సెంటర్‌లో మూడు సెషన్లలో వ్యాక్సినేషన్ ఉంటుంది.

ప్రతి కేంద్రంలో 25మంది ఆరోగ్య కార్యకర్తలకు డ్రైరన్ వ్యాక్సినేషన్ తయారు చేసిన కోవిన్ యాప్‌లో డ్రైరన్ ఆరోగ్య కార్యకర్తల వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో శిక్షకులే కీలకమన్నారు.అదే విధంగా స్టోరేజీ కేంద్ర నుంచి వ్యాక్సిన్ సెంటర్‌కు టీకా తరలించడం, వ్యాక్సిన్ తెరవడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. టీకా వేసే సెంటర్లలో ప్రతి కేంద్రంలో వెయిటింగ్ రూమ్, టీకా స్టోరేజీ ఎలా ఉండాలి, ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలని అంశాలపై వివరించనున్నారు.లబ్దిదారుల పేర్లను కోవిన్ నమోదు చేయడం, సెంటర్ వద్దకు రాగానే గుర్తింపుకార్డు చూసి వారిని వెయిటింగ్ రూమ్‌లో కూర్చొబెట్టాలి వంటి ఎలా చేయాల్లో చెబుతామంటున్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం వ్యాక్సిన్ వచ్చిన తరువాత సిబ్బంది చేయాల్సి విధులను వివరిస్తూ ముందుగా టీకా ఎవరికి వేయాలో వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. వ్యాక్సిన్ సెంటర్లో వేస్తారో లబ్దిదారులకు సమచారం అందిస్తారు. టీకా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు గుర్తింపు కార్డు చూసి వ్యాక్సిన్ వేస్తారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఆరగంట పాటు అక్కడే వేచి ఉండాలి. ఇబ్బంది అనిపిస్తే అక్కడ ఉన్న వైద్యులను సంప్రదించాలి. ప్రక్రియ పూర్తియినంకు లబ్ధ్దిదారులు సెల్‌పోన్‌కు సమాచారం వస్తుంది. ఇందులో లబ్ధిదారు పేరు,పుట్టిన తేదీ, అడ్రస్సు, టీకా సెంటర్, వ్యాక్సిన్ బ్యాచ్‌నెంబర్ ఉంటాయి. వ్యాక్సిన్ రెండు డోస్ తీసుకోవడానికి వచ్చినప్పడు ఈసమాచారంతో కూడిన పత్రాలను తప్పకుండా తీసుకురావాలి అనే అంశాలపై డ్రైరన్ వివరించనున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News