Sunday, May 5, 2024

కాసేపట్లో దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్

- Advertisement -
- Advertisement -

COVID-19 Vaccine Dry Run Across India

న్యూఢిల్లీ: కొవిడ్19 వ్యాక్సినేషన్‌కు శనివారం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా లు శుక్రవారమే అందుకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా చేపట్టే వాస్తవ టీకాల కార్యక్రమానికి ఇది ట్రయల్న్‌ల్రాంటిది. ఇప్పటికే అస్సాం, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించిన మొదటిదశ డ్రైరన్ విజయవంతమైందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. త్వరలోనే దేశవ్యాప్తంగా చేపట్టే టీకాల కార్యక్రమానికి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగానే ఈ డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతంలోనైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటే ముందే గుర్తించి సరిచేసేటందుకు డ్రైరన్ తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో చాలాచోట్ల శుక్రవారమే వ్యాక్సినేషన్ అధికారులు తమకు కేటాయించిన డ్రైరన్ కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు.

ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

కరోనా వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా చేపట్టే డ్రైరన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ శుక్రవారం ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. డ్రైరన్ విషయంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఎప్పటికపుడు తెలుసుకొని తగిన సూచనలు చేస్తున్నామని ఈ సందర్భంగా సీనియర్ అధికారులు మంత్రికి తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాల గురించి బ్లాక్‌స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు ఇప్పటికే తెలియజేశామని వారు వివరించారు. అధికార యంత్రాంగం, వైద్య అధికారుల మధ్య సమన్వయంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి సారించాలని అధికారులకు హర్షవర్ధన్ సూచించారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న భారీ కార్యక్రమమైనందున పరస్పర సహకారం, అవగాహన అవసరమని ఆయన తెలిపారు. అవసరమైనచోట ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు. వ్యాక్సిన్ నిల్వ, రవాణా విషయంలో భద్రత, వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించడంలాంటి అంశాలను అధికారులకు హర్షవర్ధన్ గుర్తు చేశారు. డ్రైరన్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికపుడు కోవిన్ యాప్‌లో పొందుపరుస్తున్నట్టు అధికారులు తెలిపారు.

 

COVID-19 Vaccine Dry Run Across India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News