Wednesday, May 1, 2024

ఇలాంటి పరిస్థితులను నా జీవీతంలో చూడలేదు: సిపి అంజనీకుమార్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ల సేవలు అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కింగ్ కోఠిలోని కరోనా ఐసెలేషన్ ఆస్పత్రిని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి పులగుచ్చాలు ఇచ్చి అభినందించారు. నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా వచ్చిన వారికి సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బందికి చాలా సేవ చేస్తున్నారని అన్నారు. వారి సేవలు మరువరావని, అందుకే వారిని అభినందించేందుకు ఆస్పత్రికి వచ్చానని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తన జీవీతంలోనే చూడలేదన్నారు. ప్రతి ఒక్కరు వైద్యులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరూ సమష్టిగా పోరాడితే కరోనాను పారద్రోలవచ్చని తెలిపారు. నగరంలో లాక్‌డౌన్ సమర్థవంతంగా జరుగుతోందని తెలిపారు. వైద్యులు విశ్రాంతి తీసుకోకుండా కరోనా రోగులకు వైద్య సేవలు చేస్తున్నారని వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ జాయింట్ సిపి విశ్వప్రసాద్, గజారావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

CP Anjani Kumar Visits King Koti Govt Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News