Monday, April 29, 2024

అదే మన ముందున్న ప్రథమ కర్తవ్యం: కేశవరావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్:దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్ డౌన్ పొడిగింపునకు మించిన మార్గం లేదని, లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధాని మోడీని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కోరింది. ప్రధాని మోడీ బుధవారం పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, ఎంపి నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడమే మన ముందున్న ప్రథమ కర్తవ్యమని, లాక్ డౌన్ కొనసాగించాలనే టిఆర్ఎస్ నిర్ణయాన్ని ఆయన ప్రధాని మోడీకి తెలియచేశారు.

కరోనా వైరస్ కట్టడికి ముఖ్యమంత్రి కెసిఆర్ 24 గంటలు కష్టపడుతున్నారు. లాక్ డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య.ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. ఒక్కసారి పట్టువిడిస్తే పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతాయి. రాష్ట్రంలో వలస కూలీల బాగోగులు చూసుకుంటున్నం. తెలంగాణలో రాబడులు పడిపోయాయి. రోజుకు రూ.400 కోట్లు రావాల్సి ఉండగా.. అత్యంత కష్టంగా కేవలం రూ.కోటి ఆదాయమే సమకూరుతుంది. కేంద్రం తెలంగాణకు మరిన్ని నిధులు సమకూర్చాలి. రాష్ట్రంలో రబీ పంట కొనుగోళ్లకు సంబంధించి.. ప్రభుత్వం మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసింది. రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నం అని కేశవరావు వవరించారు.

TRS MP KK seeks to PM Modi for Extends Lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News