Saturday, April 27, 2024

దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ నిరసన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మణిపూర్‌లో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ సిపిఐ ఆధ్యర్యంలో నిరసన ప్రదర్శన నిర్విహించింది. ఈ ఘటనకు బాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. మణీపూర్ అత్యాచార ఘటనను నిరసిస్తూ ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ ముందున్న గాంధీ విగ్రహం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ సిపిఐ పార్టీ ఇంచార్జ్ ఎండి ఉమర్ ఖాన్ తదితరులు పాల్గొనగా, హిమాయత్ నగర్‌లోని వై జంక్షన్ వద్ద ప్రజా సంఘాల నిరసనలో పశ్య పద్మ, బాలమల్లేష్ తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు ఒక ప్రణాళిక బద్ధంగా, బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ గుండాలతో తన మతోన్మాద సిద్ధాంతాలను అనుసరిస్తూ, కులాలతో మతాలతో రాజకీయాలు చేస్తున్నదని ,జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ తన రాక్షస పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ మణిపూర్లో గత కొంత కాలంగా జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, మానభంగాలు మర్డర్లు ఇంకా వివక్షతో అనేక దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నదని అన్నారు.

కొంతమంది మణిపూర్లో ముగ్గురు మహిళలను వివస్త్ర లను చేసి దారుణానికి పాల్పడ్డ విషయం నెలల క్రితం జరిగితే ఆ విషయం ఇప్పుడు బయటికి వచ్చిందని ఈ ఘటన బయటికి రాకుండా అన్ని సోషల్ మీడియా పైన ఆంక్షలు విధించింది కేంద్రమేనని- అక్కడ జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి బిజెపి పాలకులు వారి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని- ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పాలకుల అసమర్ధత వలన ఆర్‌ఎస్‌ఎస్ గుండాల ద్వారా బలైపోయేది సామాన్య ప్రజలు యువకులు మహిళ నేనని తక్షణం ఘటనకు పాల్పడిన వారిపై కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మతోన్మాదంతో రాజకీయాలు చేస్తున్నటువంటి బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ అరాచకాలను ఎండగట్టాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు లక్ష్మణ్, సిపిఐ నాయకులు శభాష్ ఖాన్ ,జోసఫ్ ,నవాజ్ ఖాన్, శ్రీనివాస్, సంపత్ ,అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News