Monday, April 29, 2024

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కు షాకిచ్చిన ముసలి… (వీడియో)

- Advertisement -
- Advertisement -

నీటిలో ఉన్న ముసలిని గమనించి తన డ్రోన్ సహాయంతో వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కు ఆ ముసలి ఊహించని షాకిచ్చింది. దీనికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.. నదిలో ఉన్న ముసలి ఫుటేజ్ ని డ్రోన్ తో క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించిన ఫోటోగ్రాఫర్ కు చుక్కెదురైంది. మొస‌లిని ద‌గ్గ‌ర నుంచి క్యాప్చ‌ర్ చేస్తుండగా.. నీటి నుంచి ముసలి తన తల పైకెత్తి డ్రోన్ వైపు దూసుకెళ్లింది.

దీంతో ఫోటోగ్రఫర్ డ్రోన్ ను ఆటు ఇటు కదిలిస్తూ ఆట పట్టిస్తుండగా.. ముసలి ఊహించని షాకిచ్చింది. అమాంతం గాల్లోకి ఎగిరి డ్రోన్ ను నోటకరిచి నీటిలోకి తీసుకెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే వన్ మిలియన్ కు పైగా నెటిజన్లు ఈ వీడియోను చూసి తమత్కారంగా కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News