Monday, April 29, 2024

వివిఐపిల భద్రతా విధుల్లోకి సిఆర్‌పిఎఫ్ మహిళా కమాండోలు

- Advertisement -
- Advertisement -

CRPF Women Commandos To Provide Security To VVIPs

మొదట అమిత్‌షా, సోనియా, ప్రియాంకగాంధీలకు..

న్యూఢిల్లీ: జెడ్ ప్లస్ కేటగరీ కింద రక్షణ పొందుతున్న విఐపిల భద్రతా సిబ్బందిలోకి మొదటిసారి సిఆర్‌పిఎఫ్ మహిళా కమాండోలను చేర్చుతున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంకాగాంధీలకు మొదటగా మహిళా కమాండోలను కేటాయించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. మొదటి బ్యాచ్‌లో 32మంది మహిళా సిబ్బందికి కమాండోలుగా పని చేయడానికి పదివారాల శిక్షణ ఇచ్చినట్టు ఆ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనవరిలోనే వీరిని విధుల్లోకి పంపనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఉంటున్నవారికి మొదటగా వీరిని కేటాయిస్తారు. రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆయన భార్య గురుశరణ్‌కౌర్‌లకు కూడా మొదటి బ్యాచ్ నుంచే కేటాయించనున్నారు. వీరికి ఎక్కువభాగం విఐపిల ఇళ్ల వద్ద విధులు కేటాయించనున్నారు. సందర్శకులను పరిశీలించడం, భద్రతాపరంగా ఇతర జాగ్రత్తలు తీసుకోవడంలో వీరికి విధులు కేటాయిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News