Monday, May 6, 2024

సైలెంట్‌గా సైబర్ క్రైం

- Advertisement -
- Advertisement -

Cyber Crimes Hiked in Hyderabad

ఎస్‌ఎంఎస్ టూ ఫోన్ యాప్‌ను ఉపయోగిస్తూ మోసాలు
ఎత్తుగడలు వేస్తూ యూజర్ ఐడిని సంపాదిస్తున్న నేరస్తులు
పోగొట్టుకున్న సొమ్ము కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు

పంజాగుట్ట: ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో మోసాలు చేస్తూనే ఉన్నారు. సైబర్ నేరాలతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లు తాజాగా ఎస్‌ఎంఎస్ టూ ఫోన్ యాప్‌ను వినియోగించుకొని బురిడీ కొట్టించేందుకు పేటీఎం, గూగుల్ పే తదితర ఇ కామర్స్ చెల్లింపు వ్యవస్థలతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల కేవైసీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించి యూపిఐ ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను తస్కరిస్తున్నారు. ఫోన్ ద్వారా ఎనిడెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్ లాంటి యాప్‌లలో ఏదో ఒకదానిని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించి బాధితుల మోబైల్ రిమోట్‌ను నేరస్థులు తెలుసుకుని బ్యాంకు ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించడంతో పాటు బాధితులకు వచ్చే ఒటిపి నంబర్లను తెలుసుకొని డబ్బు కొట్టేసేవారు.

ఇలా జరిగే ప్రతీ లావాదేవీకి బాధితుల నుంచి ఒటిపి నంబరు తెలుసుకోవాల్సి వస్తుండటంతో తాజాగా కొత్త ఎత్తుగడలకు తెర తీశారని సైబర్ క్రైం పోలీసులు వివరిస్తున్నారు. తాజాగా నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ఇళ్లు వేరొక ప్రాంతానికి మార్చడంతో బ్రాడ్‌బాండ్ కనెన్షన్‌ను కొత్త చిరునామా తెలిపేందుకు నంబర్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. ఈక్రమంలో ముందుగానే సైబర్ నేరస్థులు కస్టమర్ కేర్‌లో పొందుపరిచిన నంబరుకు ఫోన్ చేశారు. ఇదే అదనుగా భావించిన సైబర్ మోసగాళ్లు అతన్ని మాటల్లోకి దింపి యూపిఐ ఖాతా, డెబిట్ కార్డు వివరాలు తెలుసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్‌ఎంఎస్ టూ ఫోన్ యాప్‌ను నిక్షిప్తం చేసుకోవాలని సూ చించి వెంటనే అతడి పేరుతో బ్యాంకులో పది లక్షల ఇన్‌స్టంట్ రుణం మంజూరు చేయించి ఆ డబ్బును కాజేశారు.

తన ప్రమేయం లేకుండానే ఖాతాలో అనూహ్యంగా డబ్బు జమ కావడం వెంటనే మరో ఖాతాలోకి బదిలీ కావ డం వల్ల బాధితుడు బ్యాంకును సంప్రదించగా మోసం వెలుగుచూడటంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఎంఎస్ టు ఫోన్ యాప్‌ను బాధితుల ఫోన్‌లో నిక్షిప్తం చేయించి యూజర్ ఐడిని తెలుసుకుంటున్నారు. ఆ సమయంలో తమకు చెం దిన నంబరుకు నమోదు చేయిస్తున్నారు. అలా చేస్తే బాధితుల ఫోన్లకు వచ్చే సంక్షిప్తం సందేశాలు ఆటోమేటిగ్గా నేరస్థులకు చేరిపోతాయి. అప్పుడు బ్యాంకు లావాదేవీ నిర్వహించేటప్పుడు వచ్చే ఒటిపి కోసం బాధితులను అడగాల్సి న అవసరం లేకపోవడంతో నేరుగా కొత్త తరహా మో సాలలకు పాల్పడుతున్నారు. ఖాతాలో నుంచి డబ్బు పొగొట్టుకున్న బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Cyber Crimes Hiked in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News