Sunday, April 28, 2024

‘డి51’లో కింగ్ నాగార్జున…

- Advertisement -
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పవర్ ప్యాక్డ్ రోల్‌లో కింగ్ నాగార్జున అక్కినేని జాయిన్ అయ్యారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మంగళవారం ఈ ప్రకటన చేశారు.

ఇద్దరి స్టార్స్ అభిమానులు వారి స్క్రీన్ పై చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి(ఏషియన్ గ్రూప్) బ్యానర్‌లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News