Sunday, May 12, 2024

పంజాబ్‌కు దళిత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎన్నికల స్టంట్

- Advertisement -
- Advertisement -

Dalit Chief Minister Congress election stunt for Punjab

బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి

లఖ్నో: కాంగ్రెస్ ఎన్నికల స్టంట్‌లో భాగంగానే చరణ్‌జిత్‌సింగ్ చన్నీని పంజాబ్‌కు మొదటి దళిత ముఖ్యమంత్రిగా చేసిందని బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి అన్నారు. కాంగ్రెస్ ఎత్తుగడకు దళితులు పడిపోరన్న విశ్వాసం తనకున్నదని ఆమె అన్నారు. కులతత్వపార్టీలు దళితులు, ఒబిసిలకు పంజాబ్, యుపి, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఏ పదవులిచ్చినా వారి స్వార్థం కోసమే తప్ప, ఆ వర్గాలపై దోపిడీని నిలిపి వేసేందుకు కాదని ఆమె విమర్శించారు. సంక్షోభంలో చిక్కుకున్నపుడే ఆ పార్టీలకు దళితులు గుర్తుకొస్తారని ఆమె అన్నారు. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఎడి)తో ఈ ఏడాది జూన్‌లోనే బిఎస్‌పి ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నది. తమ కూటమి గెలిస్తే పంజాబ్‌కు దళితుడిని ఉపముఖ్యమంత్రిని చేస్తామని ఎస్‌ఎడి అధినేత సుఖ్‌బీర్‌సింగ్‌బాదల్ ఆ సందర్భంగా ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News